Roja With Jabardasth Artists : సినీ నటి రోజా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన రోజా వెండితెరపై మంచి వినోదం పంచింది. ఎంఎల్ఏగా ఉన్నప్పుడు రోజా జబర్ధస్త్ వంటి షోలకి జడ్జిగా ఉంది. మంత్రి అయిన తర్వాత మంత్రి పూర్తిగా అన్ని షోలకి హాజరైంది.ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రతి రోజూ ఒక గ్రామంలో పర్యటిస్తున్నారు. రాత్రి అక్కడే బస చేసి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. నగరి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన రోజా పల్లెనిద్ర చేస్తూ గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే రోజా జబర్ధస్త్ నుండి దూరమైన కూడా ఆ కమెడీయన్స్‌తో కలిసి తెగ సందడి చేస్తుంటుంది.
ఈరోజు రోజా పుట్టిన రోజు కావడంతో జబర్దస్త్ ఆర్టిస్టులంతా ఆమెను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలిపారు. ఆమెతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా సందర్శించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అందరూ గ్రూప్ ఫొటో దిగగా, ఆ పిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. జబర్ధస్త్‌ని వీడి రోజా ఏడాది అయింది. సంవత్సరం తర్వాత రోజా మళ్లీ జబర్ధస్త్ నటీనటులతో కలిసి కనిపించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక రోజా ఇన్విటేషన్‌లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, హైపర్ ఆది మాత్రం హాజరు కాలేదు.
సుడిగాలి టీమ్ రోజాకు ఎంత స్పెషలో తెలిసిందే. వారిపై ఎంతలా ఫన్నీ కామెంట్స్ చేసినా, వారూ జోక్స్ వేసినా సరదగా తీసుకొని ప్రేక్షకులను అలరించారు. ఈ గ్రూప్ ఫొటోలో వారూ కూడా ఉండి ఉంటే బాగుండేది అని కొందరు ముచ్చటించుకుంటున్నారు.రోజాతో ఫొటో దిగిన వారిలో అదిరే అభి, గాలిపటాల సుధాకర్, అప్పరావు, ఇమ్మాన్యుయేల్, కెవ్వు కార్తీక్, తదితరులు ఉన్నారు. ఇక రోజా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతూ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరికి ఏ సమస్య వచ్చిన కూడా వారికి అండగా నిలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…