RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతి విషయంలోనూ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. మంచి, చెడు ఏదైనా దానిపై ఓ ట్వీట్ చేసి వార్తలలోకి ఎక్కుతుంటారు. రీసెంట్‌గా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపై కూడా తనదైన శైలిలో ట్వీట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా నుండి తరుముకొస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్‌కి సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేసి వార్తలలోకి ఎక్కాడు.
ఒమిక్రాన్ వేరియంట్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ పేరుతో ఇప్పటికే the omi kron variant అనే సినిమా 1963లోనే వచ్చిందని చెబుతూ అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ట్యాగ్ లైన్ కూడా చెప్పమని అడిగారు. ఏదో ఒక రోజు భూమి శ్మశానంగా మారనుందని ట్యాగ్ లైన్‌లో రాసి ఉంది.
Believe it or faint ..This film came In 1963 ..Check the tagline 😳😳😳 pic.twitter.com/ntwCEcPMnN
— Ram Gopal Varma (@RGVzoomin) December 2, 2021
వర్మ ట్వీట్‌తో ఇది నిజమే అవుతుందంటూ కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో ఏకంగా అదే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియెంట్ ట్రేస్ అయినట్లు జీనోమ్ స్వీక్వెన్సింగ్ పరీక్షలో వెల్లడైంది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ బాంబులాంటి వార్త పేల్చారు. ఒమిక్రాన్ బారినపడ్డ వారిలో ఒకరు 66 ఏళ్ల పురుషుడు, మరొకరు కూడా 46 ఏళ్ల పురుషుడు ఉన్నారు.