Renu Desai : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రూపొందిన సూపర్ హిట్ చిత్రం యానిమల్. ఇందులో రష్మిక మందాన కథానాయికగా నటించగా, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. గత నాలుగు రోజుల్లో 400 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. యానిమల్ సినిమా 210 కోట్ల షేర్‌తో టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని కేవలం మూడు రోజుల్లోనే ఫినిష్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా భారీ లాభాలతో ముందుకెళ్తున్నది. ఈ సినిమా ఫుల్ రన్‌లో 800 కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు.
మరోవైపు యానిమల్ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా రేణూ దేశాయ్ ఈ సినిమాపై షాకింగ్ రివ్యూ ఇచ్చింది.ఈ సినిమాని తాను అనుకోకుండా చూడాల్సి వచ్చిందని తెలిపారు. సినిమా అద్భుతంగా ఉందని… ఈ సినిమాతో తాను ప్రేమలో పడిపోయానని చెప్పారు. ఈ సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని… మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లో చూడాలని చెప్పుకొచ్చింది.వీక్ హార్ట్ ఉన్నవారు ఈ సినిమా చూడకపోవడమే మంచిదని ఎందుకంటే ఇందులో రక్తపాత సన్నివేశాలు చాలా ఉన్నాయని అన్నారు. ఏదైనా ఒక విభిన్నమైన సినిమాను చూడాలనుకునే వారికి మాత్రం తప్పకుండా యానిమల్ సినిమా నచ్చుతుందని తన పేర్కొన్నారు రేణు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాపై నాలుగు పేజీల రివ్యూను విడుదల చేయడం మనం చూశాం. అర్జున్ రెడ్డి వంటి బోల్డ్ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా నుండి వచ్చిన ఈ చిత్రంపై క్రేజ్ రోజురోజుకి మరింత పెరుగుతూ పోతుంది. ఈ చిత్రాన్ని చూసిన కొందరు సినిమా కాస్తా లెంగ్తీగా ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ సీన్స్, పాటలు ఇలా బాగున్నాయని.. రణబీర్ తన నటనతో అదరగొట్టారని చెప్పుకొస్తున్నారు. ఇంటర్నెల్ సీన్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందని , విజులవ్స్, ఆ టేకింగ్, ఆ మ్యూజిక్.. సూపర్‌గా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…