Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తను చెప్పాల్సిన ప్రతి విషయాన్నినిర్మొహమాటంగా చెప్పేస్తుంది. సమాజంలో జరిగే ప్రతి విషయంపై ఓపెన్‌గా కామెంట్ చేస్తుంది. తాజాగా భారతీయుడు2 చిత్రంపై సంచనల కామెంట్స్ చేసింది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన ‘భారతీయుడు-2’ మూవీ జనాదరణ పొందలేకపోయిన విషయం తెలిసిందే. 90లలో వచ్చిన సూపర్ హిట్ ‘భారతీయుడి’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో భారతీయ సినిమా గర్వించేలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన దర్శకుడు శంకర్‌కి ఏమైందంటూ సినీ ప్రేమికులు తిట్టుకున్నారు కూడా.
ఇక ‘ఇండియన్-2’లో కొన్ని డైలాగ్స్ పెట్ లవర్స్ ఆగ్రహానికి కారణమయ్యాయి. ముఖ్యంగా వీధి కుక్కలపై ఉన్న డైలాగ్ కాంట్రావర్సీకి కారణమైంది. దీనిపై నెట్టింట పలువురు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇదే విషయమై ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. అసలు రైటర్స్ ఇలాంటి సంభాషణలు ఎలా రాస్తారో అని ఆమె కోపగించుకున్నారు. అందుకే ఈ మూవీ ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ మూవీలోని కమల్ హాసన్ వీధి కుక్కలను కించపరిచే విధంగా చెప్పే డైలాగ్ తాలూకు క్లిప్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఆ క్లిప్‌కు “ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. ఈ ఇడియట్ రైటర్స్ ఎలా రాస్తారు ఇలాంటి డైలాగ్స్? అసలు వాళ్లకి ఏమైంది?” అని ఆమె ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు. దాంతో రేణు దేశాయ్ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాలని భారీ వర్షాలు ముంచెత్తాయి. శంకర్ పల్లి ప్రాంతంలో వర్షాల కారణంగా కనీసం చోటు కూడా లేకుండా అల్లాడుతున్న ఆవుల్ని, ఇతర పశువుల్ని రేణు దేశాయ్ తన సొంత నిధులతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ దృశ్యాలని కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆవులకు పూజలు చేశారు. యానిమల్స్ విషయంలో రేణు దేశాయ్ చాలా కేరింగ్ చూపిస్తున్నారు. వీధి కుక్కలా విషయంలో కూడా రేణు దేశాయ్ తనవంతు సాయం చేస్తున్నారు. అయితే యానిమల్స్ ని హింసించినా, వాటి పట్ల చెడుగా ప్రవర్తించినా రేణు దేశాయ్ సహించడం లేదు. ఆ కారణంతోనే భారతీయుడు 2 చిత్రంపై ఆమె మండిపడ్డారు.