Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ రష్మిక. ఈ భామ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకొని పెద్ద హీరోయిన్‌గా మారింది.ష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా ఉన్న క్రేజీ మూవీ ‘పుష్ప 2: రూల్’లో రష్మిక నటిస్తున్నారు. రెయిన్‍బో, కుబేరా సహా మరో రెండు చిత్రాలు రష్మిక లైనప్‍లో ఉన్నాయి. అయితే, కొన్ని రోజులుగా రష్మిక బయట పెద్దగా కనిపించలేదు. అందుకు కారణమేంటో ఆమె తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. తనకు స్వల్వ ప్రమాదం అయిందని, గాయం నుంచి కోలుకుంటున్నట్టు తెలిపారు. అలాగే ఇన్‍స్టాగ్రామ్‍లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
గత నెలలో తనకు చిన్న యాక్సిడెంట్ అయిందని రష్మిక వెల్లడించింది. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పింది. త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటానని తెలిపింది. రేపు అనేది ఉంటుందో లేదో తెలియదని… అందుకే హ్యాపీగా జీవించండి అని ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ‘ఇంకొక అప్టేడ్ ఏమిటంటే… లడ్డూలు బాగా తింటున్నా’ అని రష్మిక తెలిపింది. రేపు ఉందో లేదో మనకు తెలియదని, అందుకే ప్రతీ రోజు సంతోషంగా ఉండాలని రష్మిక మందన్నా ఎమోషనల్‍గా రాసుకొచ్చారు. “ఎప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే జీవితం చాలా సున్నితమైనది, స్వల్పమైనది. ఒకవేళ మనకు రేపో ఉంటుందో లేదో తెలిదు. అందుకే ప్రతీ రోజు హ్యాపీనెస్‍తో ఉండాలి” అని రష్మిక మందన్నా తెలిపారు.
అల్లు అర్జున్‍తో రష్మిక నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై పాన్ రేంజ్‍లో భారీ క్రేజ్ ఉంది. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ చేస్తున్న కుబేర చిత్రంలోనూ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు రష్మిక. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెండెట్ చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని కూడా చేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‍తో సికిందర్ చిత్రం కూడా రష్మిక లైనప్‍లో ఉంది. విక్కీ కౌశల్‍తో చావా చిత్రంలోనూ ఆమె నటించారు. ఈ మూవీ కూడా డిసెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. రెయిన్‍బో అనే తెలుగు మూవీకి కూడా రష్మిక లైన్‌లో పెట్టింది.