Rana And Suresh Babu : టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. ఫిలిం నగర్ లాండ్ వివాదంలో సురేష్ బాబు,రానా మీద క్రిమినల్ కేసు నమోదయిన విషయం తెలిసిందే. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదులో ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల దగ్గరకు వెళితే పట్టించుకోలేదని అందుకే ప్రమోద్ కుమార్ కోర్టు కెళ్లారు. కోర్టు జోక్యంతో సురేష్ బాబు, రానా సహా మరి కొంతమందిపై కేసు నమోదు చేశారు.
సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరి కొంతమంది విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది కోర్టు. తాజాగా ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం పై ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా, గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్‌లోని కో ఆపరేటివ్ సోసైటీ పరిధిలో 1007 గజాల స్థలానికి సంబంధించిన వివాదం నడుస్తుంది. ఈ స్థలం విషయంలో ముందు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సురేష్ బాబు నడుచుకోవటం లేదని , తమ వద్ద డబ్బు తీసుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించటం లేదని బంజారా హిల్స్‌కి చెందిన ప్రమోద్ కుమార్ అనే బిజినెస్ మ్యాన్ నాంపల్లి కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు.
2018లో లీజు ముగుస్తుందనగా.. ప్లాట్ నం.2లోని స్థలాన్ని రూ. 18 కోట్లకు అమ్మేందుకు సురేష్ బాబు ఆసక్తి చూపించటంతో ప్రమోద్ రూ.5 కోట్లు చెల్లించి, డీల్ రాసుకున్నారు. అయితే అంతకు ముందే లీజు గడువు ముగిసినా ప్రమోద్ ఖాళీ చేయటం లేదంటూ ప్రమోద్‌పై సురేష్ బాబు కేసు వేసి నోటీసులిచ్చారు. అయితే తన వద్ద రూ.5 కోట్లు అడ్వాన్స్ తీసుకుని సురేష్ బాబు రిజిస్ట్రేషన్ చేయటం లేదంటూ ప్రమోద్ కోర్టుని ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో 5 కేసులు వివిధ కోర్టుల్లో ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌లో లీజు స్థలంలో ఉంటున్న ప్రమోద్ కుమార్ సెక్యూరిటీని తరిమి వేయడంతో పాటు ప్రమోద్‌ను బెదిరించారు. దీంతో ప్రమోద్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవటంతో ఆయన నాంపల్లి కోర్టుకు వెళ్లారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…