Actress Hema : టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో నటి హేమ ఒకరు. బ్రహ్మానందంతో ఆమె కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో రక్తి కట్టిస్తుంటాయి. ఒకప్పుడు హేమ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రాజకీయాలు, బిజినెస్‌లు అంటూ కొంత సినిమాలు తగ్గించింది. కాంట్రవర్సీలతో కూడా వార్తలలో నిలుస్తూ ఉంటుంది హేమ. అడపా దడపా కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సన్నిహితులను కలుస్తున్నారు. కానీ సినిమాల్లో కనిపించటం తక్కువైంది. రీసెంట్‌గా కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ కొత్త బ్రాంచీని మణికొండలో ప్రారంభించగా, ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్స్ సహా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో నటి హేమ కూడా అక్కడకు వచ్చారు.
ఇటీవల సినిమాలలో పెద్దగా కనిపించడం లేదేంటి అని ప్రశ్నించగా,దానికి స్పందించిన హేమ.. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో సంపాదన ఎక్కువై పోయి, సుఖ పడటం ఎక్కువ అలవాటు అయిపోయి, కష్టపడటానికి ఇష్టపడటం లేదంతే అంటూ కాస్త సెటైరికల్‌గా మాట్లాడింది. అయితే కొందరు ఆమె నిజంగానే బిజినెస్‌లు చేస్తూ బిజీగా ఉందని అంటున్నారు. మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి? అని సదరు యాంకర్ ఇదే ప్రశ్న వేస్తే … ఆమె సమాధానం ఇవ్వలేదు. మరో ఇంటర్వ్యూలో చెబుతానంటూ దాటవేసింది. 56 సంవత్సరాల వయస్సు ఉన్న హేమ…రోజుకి ఈమె రూ.1.5 నుంచి రూ.2 లక్షల రూపాయల వరకు అటు ఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. దీంతో హేమ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన కూడా సరైన పాత్రలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కాగా, ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు సపోర్ట్‌గా హేమ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తర్వాత ఎందుకనో హేమ మీడియా ముందుకు రావటం కూడా మానేసింది. సినిమాల్లోనూ పెద్దగా కనిపించటం లేదు. రానున్న రోజులలో ఆమె కూతురిని కూడా సినిమాలలోకి తీసుకు వస్తుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై పూర్తి క్లారిటీ అయితే లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…