Radhika Apte : రాధికా ఆప్టే.. ఈ బోల్డ్ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలలో విచిత్ర పాత్రలు పోషించి మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ ముద్దుగుమ్మ సాటి హీరోయిన్లతో పోలిస్తే పెక్యులర్ కెరీర్ గా చెప్పుకోవచ్చు. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీషోలు.. ఇలా వేదిక ఏదైనా సరే, నచ్చితే చేసేయడం రాధిక ప్రత్యేకత అని చెప్పాలి రీసెంట్‌గా కత్రినాకైఫ్ కథానాయికగా నటిస్తున్న ఓ చిత్రంలో అతిథిపాత్రలో నటించింది రాధిక ఆప్టే. ఈ మూవీ గురించి తాజాగా రాధిక కీలక విషయాలు వెల్లడించి అందరిని ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం రాధిక చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రధారులుగా శ్రీరాం రాఘవన్ దర్శకత్వంలో ‘మేరీ క్రిస్మస్’ అనే సినిమా రూపొందుతున్నది. ఇందులో రాధిక అతిథిగా నటించింది. అతిథి అంటే సినిమాలో ఓ అయిదారు సన్నివేశాలు ఉంటాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అని చెప్పాలి. కేవలం ఒకేఒక్క సన్నివేశంలో ఆమె కనిపించగా, తన పాత్ర గురించి రాధికా ఆప్టే మాట్లాడుతూ ‘ఇంత చిన్న పాత్ర ఒప్పుకోడానికి కారణం కేవలం దర్శకుడు. తను నాకు మంచి ఫ్రెండ్. అంతేకాదు. తను తీసిన ప్రతి సినిమాలోనూ నేనున్నా కాబట్టి ఆ సెంటిమెంట్‌ని మిస్ చేయకూడదనే ఇందులో నటించా. చేసింది ఒక్క సన్నివేశమే అయినా.. షూటింగ్ మాత్రం రెండు రాత్రుళ్లు పాల్గొనాల్సి వచ్చింది’ అంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది రాధికా ఆప్టే.

బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ‘అక్క’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. పీరియడ్ థ్రిల్లర్ గా రూపొందుతున్నఈ సిరీస్ లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రత్యర్థులుగా కనిపించనున్నట్లు వార్తలు బయటకు రాగా, దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ షూటింగ్ 75 శాతానికి పైగా పూర్తి అయిన తర్వాతే అఫీషియల్ ప్రకటనలు చేయాలి అనుకుంటున్నారని తెలుస్తుంది.