Raakshasa Kaavyam OTT Release Date : అక్టోబర్ 13 థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు అభయ్ భేతిగంటి హీరోగా మరో యువనటుడు అన్వేష్ మైకేల్ కలయికలో వచ్చిన చిత్రం రాక్షస కావ్యం ఒకటి. దర్శకుడు శ్రీమాన్ కీర్తి తెరకెక్కించిన ఈ చిత్రంకి మంచి ఆదరణ లభించింది. పురాణాల్లోని జయవిజయులు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసులుగా పుట్టారు.వాళ్లు కలియుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ‘ఈ సినిమా ద్వారా ఓ విభిన్నమైన ప్రయత్నం చేశాం. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి ఓ కొత్త తరహా చిత్రాన్ని నిర్మించామని మేకర్స్ ప్రచారం చేశారు.
అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. రాక్షస కావ్యం సినిమా డిసెంబర్ 15వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. “కాలం రాసిన రాక్షస కావ్యం. డిసెంబర్ 15న ఆహాలో” అని ఆహా నేడు ట్వీట్ చేయడం మనం చూడొచ్చు. రాక్షస కావ్యం సినిమాలో అభయ్ నవీన్, అన్వేష్ ప్రధాన పాత్రలు చేయగా.. దయానంద్ రెడ్డి, పవన్ రమేశ్, యాదమరాజు కీలకపాత్రల్లో నటించారు. చిత్రం కథ విషయానికి వస్తే.. ..ఈ చిత్రం 2004 ఆ సమయంలో సెటప్ చేయబడింది. అజయ్(అభయ్ భేతిగంటి) ఓ కాంట్రాక్టు కిల్లర్ పైపెచ్చు తనకి చదువుకునే వారు అంటే ఎంతో గౌరవం అలాగే ఇంకో పక్క విజయ్(అన్వేష్ మైకేల్) తాను సినిమాల్లో విలన్స్ ని న్యాయం చెయ్యాలని తనదో సెపరేట్ ట్రాక్ లో వెళ్తూ ఉంటాడు.

అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? వీరిద్దరికీ ఏదన్నా బ్యాక్ స్టోరీ ఉందా? ఉంటే దానికి కారణాలు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. “రాక్షస కావ్యం” లో ఇంట్రెస్టింగ్ స్టార్టింగ్ అండ్ ఫస్టాఫ్ లు ఎంతగానో ఇంప్రెస్ చేస్తాయి. అలాగే నటుడు అభయ్ బేతిగంటి అన్ని ఎమోషన్స్ ని కూడా బాగా చేశాడు. కామెడీ, ఎమోషన్స్ తో సాగిన మంచి ఫస్టాఫ్ తర్వాత అసలు ఏమాత్రం ఆకట్టుకోని ఒక బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ సెకండాఫ్ అయితే టోటల్ సినిమా రిజల్ట్ ని మార్చేసింది.