Pushpa Movie : తొలిసారి సమంత పుష్ప సినిమా కోసం ఐటమ్ భామగా మారిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే పాట మత్తు వాయిస్‌తో సాగగా, ఈ పాటలో సమంత తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. సామ్ కాస్ట్యూమ్, స్టైల్, లుకింగ్ అన్నీ పాటకు పర్‌ఫెక్ట్ సెట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి మార్మోగించడంతో సాంగ్ బ్లాక్‌బాస్టర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు.
అయితే చంద్రబోస్ రాసిన ఈ ఐటమ్ పాటను పాడింది ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటను మరో మెట్టు ఎక్కించింది. దీంతో ఈ సింగర్ ఎవరని వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. మంగ్లీలాగే ఇంద్రావతి చౌహాన్ కూడా పలు జానపాద పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో కోటి జడ్జిగా వచ్చిన బోల్ బేబీ బోల్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. పుష్ప సినిమా కంటే ముందు జార్జి రెడ్డి సినిమాలో కూడా మంగ్లీ చెల్లెలు ఒక పాట పాడింది.
జాజిమొగులాలి అనే సాగే ఈ పాట కూడా బాగానే ఉంటుంది. కానీ అంతగా పాపులర్ కాలేదు. కానీ ఇదే సినిమాలో మంగ్లీ పాడిన వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్ అనే సాంగ్ మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ పాడే ఛాన్స్ దక్కించుకుంది ఇంద్రావతి చౌహాన్. మత్తెక్కించే వాయిస్‌తో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ అంటూ ఈమె పాడిన పాట వింటూ ఇప్పుడు యూత్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ పాటని కన్నడలో మంగ్లీ పాడి అలరించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…