Purushothamudu On OTT : రాజ్ తరుణ్ ఈ మధ్యకాలంలో నటించిన సినిమాల్లో పురుషోత్తముడు కూడా ఒకటి. ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చింది. రామ్ భీమన ఈ మూవీని తెరకెక్కించారు. ఫ్యామిలీ యాక్షన్ డ్రామా జోనర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హాసిని సుధీర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్‌లు కీలకపాత్రల్లో నటించారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు సీనియర్ నటీనటులు ఈ మూవీలో నటించారు. అలాగే రాజ్ తరుణ్‌కు సంబంధించి ఈ మధ్య ఒక వివాదం కూడా బయటకు వచ్చింది. దీని కారణంగా సినిమాపై రిలీజ్‌కు ముందే కాస్త ఆసక్తి ఏర్పడింది. అయితే దాన్ని మూవీ క్యాష్ చేసుకోలేకపోయిందనే చెప్పవచ్చు.
రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు మూవీ జూలై 26వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే కథలో, కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. ఇక చాలా మంది ఈ మూవీని ఓటీటీలోనే చూద్దామని నిర్ణయించుకున్నారు. అందువల్ల థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని పురుషోత్తముడు మూవీ ఇక ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అందువల్ల అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుందని సమాచారం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో..
ఆగస్టు 23వ తేదీ నుంచి పురుషోత్తముడు మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఈ వారంలోనే అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డాక్టర్ రమేష్ తేజవత్, ప్రకాష్ తేజవత్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సత్యతోపాటు పలువురు కమెడియన్లు కూడా యాక్ట్ చేశారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను పీజీ విందా నిర్వర్తించారు. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటర్‌గా ఉన్నారు.
కాగా పురుషోత్తముడు మూవీ కాన్సెప్ట్‌తో గతంలో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయింది. అయితే ఇదే పాయింట్ ఈ మూవీకి మైనస్ అయిందని చెప్పవచ్చు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దగా వర్కవుట్ కాలేదు. అందువల్ల ఈ మూవీ రాజ్ తరుణ్ కెరీర్‌కు ఎలాంటి బూస్ట్‌ను ఇవ్వలేకపోయిందని చెప్పవచ్చు. అయితే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ మూవీ కనీసం ఓటీటీలో అయినా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.