Kannappa Heroine : మంచు మోహన్ బాబు నట వారసుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతుంది. ఇటీవల కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది అందరినీ ఆకట్టుకుంది. ఇందులో చిత్ర కథానాయికగా నుపురు సనన్‌ని ఎంపిక చేశారు. అయితే ఆ సినిమా నుంచి డేట్స్ కుదరకపోవడంతో నుపుర్ సనన్ హీరోయిన్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ హీరోయిన్‌కు సంబంధించి ప్రకటన చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో ఓ మోడల్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
మంచు విష్ణు సరసన మోడల్ ప్రీతి ముకుందన్ ను ఫీమేల్ లీడ్ గా తీసుకుందట చిత్రయూనిట్. ఎన్నో ఆడిషన్స్ నిర్వహించిన తర్వాత ఆమెని కన్ఫామ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ మెుత్తం న్యూజిలాండ్‌లో ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయనున్నారట మేకర్స్.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రీతి ముకుందన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. భరతనాట్య కళాకారిణిగా మంచి పేరు ఉంది. చాలా యాడ్స్‌కు మోడల్‌గా కూడా చేసిన ఈ భామ… కన్నప్ప’లోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటుగా ఆమె నృత్యం కూడా ప్రేక్షకులను కనువిందు చేయనుందట.

కన్నప్ప చిత్రంలో ప్రభాస్, నయనతార శివపార్వతుల్లా, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మోహన్ బాబు, శరత్ కుమార్‌లకు సంబంధించిన సీన్స్ కూడా చిత్రీకరించారు మేకర్స్. ప్రీతీకి ఇది తొలి సినిమా మాత్రమే కాదు. కళ, సినిమా రంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే ప్రపంచంలోకి వచ్చింది. ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఆమెతో కలిసి పనిచేయడానికి టీం అంతా ఎదురుచూస్తోంది అని దర్శకుడు ముఖేష్ కుమార్ తెలియజేశారు.ఇక ఇదిలా ఉంటే మంచు విష్ణుకి ఇటీవలి కాలంలో ఒక్క హిట్ కాలేదు. గతేడాది జిన్నా సినిమాకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాపై ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నారు.