Prakash Raj : 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రచ్చగా మారిందో చూశాం. విష్ణు, ప్రకాశ్ రాజ్ లు ఎన్ని విమర్శలు చేసుకున్నారో కూడా మనం చూశాం. విష్ణు, ప్రకాష్ రాజ్ రెండు ప్యానల్స్ గా పోటీ చేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసి, ప్రచారాలు, హామీలు.. ఇలా సాధారణ ఎన్నికలు రేంజ్ లో జరిగాయి ‘మా’ ఎన్నికలు. ‘మా’ ఎన్నికలు వివాదంగా మారి కొన్ని రోజులు సాగింది. ఇక మంచు విష్ణు గెలవడానికి యాక్టివ్ గా లేని పాత హీరోయిన్స్, మెంబర్స్ ని కూడా ఎక్కడెక్కడ్నుంచో ఫ్లైట్స్ వేసి మరీ తెప్పించి ఓట్లు వేయించుకోవడం మనం చూశాం. అయితే పోటా పోటీగా జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో మంచు విష్ణు గెలిచాడు.
మా ఎన్నికల సమయంలో ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకునేంత వరకు వెళ్లారు, ప్రకాష్ రాజ్ ని మెగాస్టార్ చిరంజీవి , మెగా కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చి గెలిపించాలని అనుకున్నారు. చాలా మంది ప్రకాష్ రాజ్ సునాయాసంగా గెలుస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ, మంచు విష్ణు ఆశ్చర్యంగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అయితే మా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ తర్వాత విష్ణు చేసింది సున్నా అంటూ ప్రకాశ్ రాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు తను ఎన్నికైన వెంటనే సొంత భవనం నిర్మాణానికి కృషి చేస్తాను అని అన్నాడు కూడా. మంచు విష్ణు ఎన్నికై రెండేళ్లు కావొస్తోంది, ఇప్పుడు మళ్ళీ మా కి ఎన్నికలు కూడా వచ్చేస్తాయి, అయితే ఈ సమయంలో ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

“రెండేళ్లు అయిపోయాయి, కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు, అలాగే మా కి సొంత భవనం కూడా లేదు, మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు సున్నా,” అని తెలిపారు. మీరు మళ్ళీ పోటీ చేస్తారా? అని అడగగా ప్రకాష్ రాజ్ సమాధానమిస్తూ.. హామీలు నెరవేరాయా లేదా అని ఓటు వేసిన వాళ్ళు అడగాలి. దొంగ ఓట్లు వేసిన వాళ్ళు ఎలాగో అడగలేరు. బయటి నుంచి ఫ్లైట్స్ వేసి తీసుకొచ్చిన వాళ్లకు సంబంధం లేదు. వీళ్ళు తెప్పించుకొని ఓటు వేయించుకొని పంపించారు. ఉన్నవాళ్లు అడగాలి. అలాగే ఏ పెద్దలైతే ఆయన వెనక ఉండి గెలిపించారో వాళ్ళ మనసాక్షికి వాళ్ళైనా అడగాలి. ఆయన్ని ఓడించి నిన్ను గెలిపించాం మరి ఏం చేయలేదు ఏంటి అని వాళ్ళైనా అడగాలి. నేను ఓడిపోయాను, తీర్పు పాటించి బయటకి వచ్చేసాను. ఓటు వేసినవాళ్లు అడగాలి. ఇప్పుడు మళ్ళీ పోటీ చేసేంత టైం నాకు లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి అని అన్నారు ప్రకాశ్ రాజ్.