Prabhas Net Worth : రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆయన ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాగా, ఈ మూవీ విడుదలైన సమయంలో అతను ఈ స్థాయికి వస్తాడని ఎవరు కలలో కూడా అనుకోలేదు. మొదటి సినిమాలో అతని నటనపై విమర్శలు చాలా వచ్చినప్పటికీ ప్రభాస్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా చాలా కష్టంతో ఈ స్థాయికి వచ్చాడు. ప్రతి సినిమాలో వైవిధ్యమైన నటన కనబరుస్తూ ఉన్నత స్థానానికి ఎదిగాడు.ప్రభాస్ కు బాక్సాఫీస్ హోదా అంత ఈజీగా ఏమీ రాలేదు. మొదట్లో మంచి కథలను కూడా అతను మిస్ చేసుకున్నాడు. అవి చేసి ఉంటే ప్రభాస్ రేంజ్ ఇప్పుడు మరో రేంజ్‌లో ఉండేది.
ఇక మరో రెండు రోజులలో ప్రభాస్ సలార్ చిత్రంతో పలకరించనున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్‌కి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. ఆయన ఆస్తుల విలువ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 2014-15 అంటే బాహుబలి రెండు చిత్రాలు చేయకముందు ప్రభాస్ రెమ్యునరేషన్ చాలా తక్కువ. అప్పుడు ప్రభాస్ నెట్ వర్త్ సుమారు రూ. 124 కోట్లు మాత్రమే. బాహుబలి తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరగడంతో ప్రతి సినిమాకి రూ.150 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. ప్రభాస్ ఆదిపురుష్ కోసం రూ. 100 నుంచి 120 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.. అలాగే నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ కోసం రూ. 150 కోట్లు, ఇప్పుడు సలార్‌కు రూ. 100 కోట్లతో పాటు లాభాల్లోంచి 10 శాతం తీసుకోనున్నాడని టాక్ వినిపిస్తుంది.

8 సంవత్సరాలలో పారితోషికం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో ప్రభాస్ నెట్‌వర్త్ చాలా పెరిగింది. ఆయన నికర ఆస్తి విలువ రూ. 241 కోట్లుగా (29 మిలియన్ డాలర్స్/2410 మిలియన్ నెట్‌వర్త్) ఉండనుందని అంచనా. యంగ్ రెబల్ స్టార్‌కి హైదరాబాద్‌లోని జూబ్లీబిల్స్‌లో రూ. 60 కోట్ల విలువైన ఇల్లు ఉందని లైఫ్ స్టైల్ ఏషియా పేర్కొంది. హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గ్ ఖల్సాలో ఫామ్ హౌజ్ ఉందట. ఇటలీలో ఓ విలాసవంతమైన ఫ్లాట్ ఉందని, దానికి వచ్చే అద్దె రూ. 4.8 కోట్లు ఉంటుందని టాక్.ఇక ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రూ. 2 కోట్ల విలువగల బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, 2 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్‌తోపాటు రూ. 8 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు ప్రభాస్ కలిగి ఉన్నాడని సమాచారం.