Nagarjuna : బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం ఆద్యంతం రక్తి కట్టిస్తూ సజావుగానే సాగింది. కాని ఫినాలే రోజు అన్నపూర్ణ స్డూడియో గేటు దగ్గర భీబత్సం జరిగింది. బిగ్ బాస్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడులు, అల్లర్లకు పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సహా మరో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడిని అరెస్ట్ చేసి తాజాగా చంచల్‌గూడ జైలుకి తరలించి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే అతను పారిపోయాడంటూ ప్రచారాలు సాగగా, ప్రశాంత్ తాను ఎక్కడికి పోలేదని స్వయంగా వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే నిన్న రాత్రి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.
బిగ్ బాస్ షో ఫినాలే ఎపిసోడ్ తర్వాత ఈ షోపై చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదో చెత్త షో.. ఈ షో ప్రసారం చేసి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం? పిచ్చి చేష్టలతో యువతను పెడదారి పట్టించడం తప్ప అని మండిపడుతున్నారు. తాజాగా ఈ షోపై హైకోర్టు న్యాయవాది అరుణ్ రంగంలోకి దిగారు. బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఎక్కడ నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరు కూడా చేర్చాలిని, ఆయన ఈ గొడవలకి సూత్రధారి అని అరుణ్ చెప్పారు.
బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మొదటి నుంచి వాళ్ల ఫ్యామిలీకి హైకోర్ట్ న్యాయవాది అరుణ్ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రైతు బిడ్డను అరెస్ట్ చేసిన తర్వాత సదరు లాయర్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు బిగ్ బాస్ నిర్వహకులపైన కూడా ఫిర్యాదు చేశారు. అంత గొడవ జరుగుతుంటే బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. అందుకే 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశాను. నాగార్జునను కూడా అరెస్ట్ వారెంట్ మంజూరు చేసి వెంటనే అందులోకి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…