Payal Rajput : ప్రస్తుతం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలోని ఊ అంటావా సాంగ్‌కి అరియానా, విష్ణు ప్రియతోపాటు పలువురు ప్రముఖులు స్టెప్పులు వేసి ఇరగదీశారు. ఇక ఇందులోని సామి సామి అనే పాటకు పాయల్ రాజ్ పూత్ అదరగొట్టే స్టెప్పులు వేసింది.
ప్రస్తుతం ఫారిన్ ట్రిప్‌లో ఉన్న పాయల్ నగర వీధుల్లో ఈ పాటకు వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. గోల్డ్ కలర్ ట్రెండీ డ్రెస్‌లో వయ్యారంగా పాటకు కాలు కదిపిన పాయల్‌ను చూసిన కుర్రకారు ఫిదా అవుతున్నారు. ‘ఈ పాట పాడిన సింగర్ వాయిస్ చాలా బాగుంది’ అంటూ పాయల్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది.
https://www.instagram.com/reel/CXn3tGCIUm6/?utm_source=ig_embed&ig_rid=959051c2-7690-41ba-be0d-4100143d1e70
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాగా, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి విపరీతమైన స్పందన వచ్చింది. ఇందులోని పాటలు బాగా వైరల్ అయ్యాయి. అన్ని పాటలను రిపీట్ మోడ్ లో వింటున్నారు. ఈ పాటల్లో ‘సామి.. సామి..’ అంటూ సాగే ఓ సాంగ్ లో రష్మిక వేసిన ఒక స్టెప్.. బాగా వైరల్ అయింది.