Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈ మూవీలో పవన్ సరసన నిత్య మీనన్ నటిస్తుండగా.. రానా మరో కీలకపాత్రను పోషిస్తున్నాడు. తాజాగా పవన్ ఈ మూవీకి గాను తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్నారు. అయితే క్రిస్మస్ సందర్భంగా పవన్ తన భార్య వద్దకు రష్యాకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడే న్యూ ఇయర్ వేడుకలను కూడా ఆయన జరుపుకోనున్నారట.
అయితే సెలబ్రేషన్స్ అయ్యాక తిరిగి ఇండియాకు వచ్చి పవన్ మళ్లీ తన తదుపరి మూవీల షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు మళ్లీ ప్రొడ్యూసర్‌గా మారి సినిమాలను నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది.
గతంలో పవన్ కల్యాణ్ కొన్ని సినిమాలకు సమర్పకుడిగా ఉన్నారు. అప్పట్లో శరత్ మరార్ తీసిన సినిమాలను ఆయనే సమర్పించారు. అయితే వాటికి ఆయనకు పెద్దగా లాభాలు రాలేదు. కానీ నిర్మాతగా మారి సినిమాలు తీయడం అంటే పవన్‌కు ఎంతో ఇష్టం. అందుకనే ఆయన వచ్చే ఏడాది పలు మూవీలకు నిర్మాత, సమర్పకుడిగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.