Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. చిరంజీవి సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఆ తరువాత తనదైన శైలిలో నటిస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పుడు కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ ప్రజల సమస్యలలో పాలు పంచుకుంటున్నారు. ఉక్కు కార్మికుల కోసం తాజాగా దీక్ష చేస్తున్నారు. మరో వైపు భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. సాగర్ చంద్ర దర్శకుడు.
పవన్ కళ్యాణ్ త్వరలో రష్యాకు పయనం కాబోతున్నట్లు తెలుస్తోంది. భీమ్లా నాయక్ లో తన పార్ట్ షూటింగ్ ముగిసింది కాబట్టి రెండు వారాలు విశ్రాంతి తీసుకునేందుకు పవన్ రష్యా వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, పిల్లలు రష్యాలోనే ఉన్నారు. క్రిస్మస్ సంబరాలలో పవన్ వారితో జాయిన్ అవుతారు. డిసెంబర్ 20న పవన్ రష్యా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తన భార్య పిల్లలతో కలిసి జరుపుకోనున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇండియాకి తిరిగి రానున్నారు. పవన్ సతీమణి రష్యన్ అన్న సంగతి తెలిసిందే. ఆవిడ కొంతకాలంగా పిల్లలతో రష్యాలోనే ఉంటున్నారు.
కరోనా సెకండ్‌వేవ్ టైమ్ లో ఆవిడ అక్కడకు వెళ్ళారు. అందుకే కొద్ది రోజులు వారితో సరదాగా గడిపేందుకు పవన్ రష్యా వెళుతున్నట్టు టాక్. రాగానే క్రిష్ దర్శకత్వంలోని హరిహర వీర మల్లు షూటింగ్ పునః ప్రారంభించనున్నారు. ఇంక పవన్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీలో నటించాల్సి ఉంది.