Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంతో బిజీగా ఉన్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూట్ పూర్తి చేసుకున్నారు.
‘భీమ్లా నాయక్’ చివరి షెడ్యూల్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ మధ్యలో రోడ్ పై ‘భీమ్లా నాయక్’ బైక్ రైడ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాకీ యూనిఫాంలో పవన్ బుల్లెట్ నడుపుతున్న వీడియోను పవర్ స్టార్ అభిమానులు షేర్ చేస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా వాయిదాపై చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చిత్రంలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ గా.. రిటైర్డ్ హవల్దార్ గా రానా కనిపించనున్నారు. పవన్ కు జోడీగా నిత్యామీనన్.. రానాకు జంటగా సంయుక్త మీనన్ సందడి చేయనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…