పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ” భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల “అడవి తల్లి మాట” సాంగ్ ను విడుదల చేశారు. సింగర్స్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి ఈ సాంగ్ ను పాడగా, లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ థమన్ అందించారు. సాంగ్ లిరిక్స్ అద్భుతంగా ఉండడంతో శ్రోతలను ఎంతగానో ఆకర్షించింది.
భీమ్లా నాయక్ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక తెలుగు రీమేక్. త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్. ఈ యాక్షన్ మూవీకి మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 జనవరి 12న విడుదల కానుందని గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు.
జనవరి 7న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కానుండడంతో సంక్రాంతి బరిలో సందడి చేయాల్సిన సర్కారు వారి పాట ఏప్రిల్‌కి వెళ్లింది. భీమ్లా నాయక్ కూడా వాయిదా పడుతుందని అందరూ భావిస్తున్న క్రమంలో వాయిదా వేసే ప్రసక్తే లేదని కొద్దిరోజులుగా వస్తున్న అప్‌డేట్స్ ద్వారా అర్ధమైంది.
కానీ తాజాగా ఈ మూవీని సంక్రాంతి బరి నుండి తప్పించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో పలువురు చర్చలు జరిపించిన తర్వాత సినిమా వాయిదా వేశారని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని తెలిసింది.
అప్ డేట్..
భీమ్లా నాయక్ చిత్ర విడుదలను వాయిదా వేస్తారని, సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉండదని వస్తున్న వార్తల నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ స్వయంగా స్పందించారు. మూవీ యథావిధిగా జనవరిలోనే విడుదల అవుతుందని.. అందులో ఎలాంటి సందేహాలకు గురి కావల్సిన అవసరం లేదని.. తాజాగా స్పష్టతను ఇచ్చారు. దీంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…