వినోదం

Oppenheimer OTT Release Date : క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఓపెన్‌హైమ‌ర్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!

Oppenheimer OTT Release Date : ఇటీవ‌లి కాలంలో థియేట‌ర్‌లో సంద‌డి చేసిన ప్ర‌తి సినిమా కూడా కొద్ది రోజుల‌కే ఓటీట‌లో సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓపెన్‌హైమర్.సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. సౌండ్ డిజైన్ మరియు సినిమాటోగ్రఫీతో సినిమా చాలా రిచ్ గా ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. అయితే ఎడిటింగ్‌లో కొన్ని స‌న్నివేశాల‌ని తొల‌గిస్తే చిత్రం మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా ఉండేద‌ని చెబుతున్నారు. సీజీఐ లేకుండా అటామిక్ బాంబ్ పేలుడును చూపించడం లో లాంటి సన్నివేశాలతో నిర్మాణ విలువలు ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది ఈ చిత్రం చూస్తే అర్ధం అవుతుంది.

భౌతిక శాస్త్రవేత్త, అణుబాంబు పితామహుడిగా పేరుపొందిన రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితచరిత్ర ఆధారంగా, అణుబాంబు తయారీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పీకీ బ్లైండర్స్ వెబ్‌ సిరీస్‌ ప్రధాన నటుడు, ప్రముఖ హీరో సిలియన్ మర్ఫీ ప్రధానపాత్ర పోషించాడు. విడుద‌లైన మొద‌టి నాలుగు రోజుల్లోనే భారత్‌లో 55 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టుకోంది. ఇక ఇప్ప‌టికే ఈ మూవీ కోసం సినీ, రాజ‌కీయ ప్రముఖులు ఎగ‌బడుతున్నారు. అయితే ఈ చిత్రంని ఓటీటీలో చూడాలని చాలా మంది ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, న‌వంబ‌ర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రిలీజ్‌కు మ‌రో ప‌ది రోజులు ఉండ‌గానే ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీకైన‌ట్టు తెలుస్తుంది. గురువారం ఎచ్‌డీ వెర్ష‌న్ ఆన్ లైన్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Oppenheimer OTT Release Date

జూలై 21న థియేట‌ర్ల‌లో విడుద‌లైన బ‌యోగ్రాఫిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ 900 మిలియ‌న్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ ఏడాది హాలీవుడ్‌లో మూడో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. అణుబాంబు క‌నిపెట్టిన ఓపెన్‌హైమ‌ర్ త‌న‌ను తాను ప్ర‌పంచ వినాశ‌కారిగా భావిస్తూ ప‌డిన మ‌నోవేద‌న‌ను సినిమాలో చాలా అద్భుతంగా ఆవిష్క‌రించారు. విక్టరీ వెంక‌టేష్ కూడా ఈ చిత్రాన్ని వీక్షించి మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది సిలియన్ మర్ఫీ, హీరోయిన ఫ్లోరెన్స్ పఫ్ మధ్య జరిగే శృంగార సన్నివేశం లో మర్ఫీ భగవద్గీత లోని వాఖ్యాలు చదువుతూ కనిపించ‌డంపై అంద‌రు విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తున్నారు. నేను ఇప్పుడు లోకాన్ని నాశనం చేసే మృత్యువునయ్యాను.. అంటూ గీతలోని వాఖ్యాల్ని ప‌లుకుతుండ‌డంతో భార‌తీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చిత్రంలోని ఆ సన్నివేశాల్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM