Niharika Konidela : విడాకుల తర్వాత మెగా బ్రదర్ ముద్దుల కూతురు నిహారిక పేరు ఎంత వైరల్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఈ అమ్మడు వార్తలలో నిలుస్తూనే ఉంది. తెలుగులో ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు చేసింది నిహారిక కొణిదెల. కానీ కమర్షియల్ హిట్ మాత్రం దక్కించుకోలేకపోయింది. పెళ్లి కారణంగా నటనకు దూరమైన నిహారిక ఈ ఏడాది రిలీజైన డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్‌తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో నిహారిక నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. విడాకులు తర్వాత నిహారిక నటిగాను ,నిర్మాతగాను బిజీ అయింది.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించిన నిహారిక తన బ్యానర్‌పై సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.ఇక నటిగాను సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. అయితే నిహారిక మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. తాజాగా దీనికి సంబంధించి కీలక ఆప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఆఫిషియల్‌గా ప్రకటించారు. దాదాపు ఏడేళ్ల తరువాత ”వాట్ ది ఫిష్” అనే సినిమాతో మంచు మనోజ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారు.ఇందులో నిహారిక కథానాయికగా నటిస్తుంది.

ఈ రోజు నిహారిక బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో నిహారిక టైట్ డ్రెస్ లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. టైట్ ఫిట్ మినీ డ్రెస్ లో నిహారిక వెలిగిపోతోంది. ఆమె పాత్ర పేరు ఆష్ అని తెలిపారు. అయితే నిహారిక పాత్ర పూర్తి పేరు అష్టలక్ష్మి అట. షార్ట్ గా ఆష్ అని పిలుస్తారు. వచ్చే ఏడాది వాట్ ది ఫిష్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని మనోజ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.