వినోదం

Nayanthara Remuneration : సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా తగ్గ‌ని రెమ్యున‌రేష‌న్‌.. ప్ర‌స్తుతం న‌య‌న‌తార ఎంత వ‌సూలు చేస్తుందంటే..?

Nayanthara Remuneration : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆమెకి సౌత్ లోనే కాదు నార్త్‌లోను విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇప్పటితరానికి లేడీ సూపర్‌స్టార్‌ అంటే నయనతారే. జవాన్‌ రిలీజ్‌ అయ్యాక అందరూ ఆమెను ఆ పేరుతోనే ఎక్కువగా పిలుస్తున్నారట. అయితే తనను అలా పిలుస్తుంటే తిడుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు నయన్‌. ఫ్యాన్స్ వల్లే తాను ఈ స్టేజ్‌లో ఉన్నానని, అయినా వాళ్లు లేడీ సూపర్‌స్టార్‌ అంటే వినడానికి కొంచెంది ఇబ్బందిగా ఉంటుంద‌ని పేర్కొంది. అయితే న‌య‌న‌తార‌కి ఇటీవ‌లి కాలంలో చాలా ఫ్లాపులు ప‌ల‌క‌రించిన కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

ఎన్నో ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో.. ముఖ్యంగా తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనకంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు సంపాదించుకున్న నయనతార.. ఇటీవ‌ల ‘జవాన్’తో బాలీవుడ్‌లో కూడా డెబ్యూ ఇచ్చింది. హిందీలో తను నటించిన మొదటి సినిమాతోనే ఏకంగా షారుఖ్ ఖాన్‌లాంటి పెద్ద హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేయ‌డ‌మే కాక పెద్ద హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార సినిమాల్లో నటిస్తూనే బిజినెస్ ఉమెన్‌గా కూడా ఎదిగింది . 2021లో నిర్మాతగా మారింది. అంతే కాకుండా తాజాగా సొంతంగా ఒక కాస్మటిక్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేసింది.అయిత‌నే న‌య‌న‌తార గ‌త మూడేళ్ల‌లో త‌మిళంలో ర‌జ‌నీకాంత్ అన్నాత్తేతో పాటు నెట్రిక‌న్‌, క‌నెక్ట్, ఇర‌వైన్, కాథు వ‌కుల రెండు కాద‌ల్ సినిమాలు చేయ‌గా, వీటిలో కాథు వ‌కుల రెండు కాద‌ల్ సినిమా త‌ప్ప మిగ‌తా చిత్రాల‌న్ని కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ్డాయి.

Nayanthara Remuneration

ఈ నెల‌లో అన్న‌పూర్ణి అనే చిత్రంతో ప‌ల‌క‌రించింది. ఈ చిత్రం కూడా అల‌రించ‌లేక‌పోయింది. ఇక మ‌ల‌యాళంలో నిజాల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు జోడీగా గోల్డ్ అనే సినిమాలు చేసింది న‌య‌న‌తార‌. అవి పెద్ద‌గా ఆమెకు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. మ‌రోవైపు తెలుగులో గోపీచంద్ ఆర‌డుగుల బుల్లెట్‌, చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ సినిమాల్లో న‌టించ‌గా అవి తేలిపోయాయు. మొత్తంగా మూడేళ్ల‌లో తొమ్మిది ఫ్లాపులు ఆమెని ప‌ల‌క‌రించగా, వాటికి జ‌వాన్‌తో బ్రేక్ ప‌డింది. న‌య‌న‌తార కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా జ‌వాన్ నిలిచింది. అన్ని ఫ్లాపులు వ‌చ్చిన న‌య‌న‌తార అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్ల‌లో న‌య‌న‌తార‌నే టాప్ ప్లేస్‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక్కో సినిమాకు 12 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM