Nayanthara Remuneration : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమెకి సౌత్ లోనే కాదు నార్త్‌లోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇప్పటితరానికి లేడీ సూపర్‌స్టార్ అంటే నయనతారే. జవాన్ రిలీజ్ అయ్యాక అందరూ ఆమెను ఆ పేరుతోనే ఎక్కువగా పిలుస్తున్నారట. అయితే తనను అలా పిలుస్తుంటే తిడుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు నయన్. ఫ్యాన్స్ వల్లే తాను ఈ స్టేజ్‌లో ఉన్నానని, అయినా వాళ్లు లేడీ సూపర్‌స్టార్ అంటే వినడానికి కొంచెంది ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంది. అయితే నయనతారకి ఇటీవలి కాలంలో చాలా ఫ్లాపులు పలకరించిన కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఎన్నో ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో.. ముఖ్యంగా తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నయనతార.. ఇటీవల ‘జవాన్’తో బాలీవుడ్‌లో కూడా డెబ్యూ ఇచ్చింది. హిందీలో తను నటించిన మొదటి సినిమాతోనే ఏకంగా షారుఖ్ ఖాన్‌లాంటి పెద్ద హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేయడమే కాక పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం నయనతార సినిమాల్లో నటిస్తూనే బిజినెస్ ఉమెన్‌గా కూడా ఎదిగింది . 2021లో నిర్మాతగా మారింది. అంతే కాకుండా తాజాగా సొంతంగా ఒక కాస్మటిక్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేసింది.అయితనే నయనతార గత మూడేళ్లలో తమిళంలో రజనీకాంత్ అన్నాత్తేతో పాటు నెట్రికన్, కనెక్ట్, ఇరవైన్, కాథు వకుల రెండు కాదల్ సినిమాలు చేయగా, వీటిలో కాథు వకుల రెండు కాదల్ సినిమా తప్ప మిగతా చిత్రాలన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

ఈ నెలలో అన్నపూర్ణి అనే చిత్రంతో పలకరించింది. ఈ చిత్రం కూడా అలరించలేకపోయింది. ఇక మలయాళంలో నిజాల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు జోడీగా గోల్డ్ అనే సినిమాలు చేసింది నయనతార. అవి పెద్దగా ఆమెకు ఉపయోగపడలేదు. మరోవైపు తెలుగులో గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్, చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాల్లో నటించగా అవి తేలిపోయాయు. మొత్తంగా మూడేళ్లలో తొమ్మిది ఫ్లాపులు ఆమెని పలకరించగా, వాటికి జవాన్‌తో బ్రేక్ పడింది. నయనతార కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా జవాన్ నిలిచింది. అన్ని ఫ్లాపులు వచ్చిన నయనతార అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతారనే టాప్ ప్లేస్‌లో ఉండటం గమనార్హం. ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.