Navdeep Dugout OTT : ప్రస్తుతం అంతటా ఓటీటీ హంగామా నడుస్తుంది. వైవిధ్యమైన కంటెంట్ ఓటీటీలోకి వస్తున్న నేపథ్యంలో యూజర్స్ కూడా ఓటీటీకి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇక తెలుగులో ఆహా వైవిధ్యమైన కార్యక్రమాలతో తెగ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు ప్రత్యేక షోస్ చేస్తూ అలరిస్తుంది. బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్‌కి ఎంత ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సక్సెస్ ఫుల్‌గా సీజన్ 3 జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు ఆహాలో డగౌట్ అనే రియాలీ షో కూడా ప్రసారం కానుందని టీజర్ ద్వారా తెలియజేశారు. ఈ షోకి నవదీప్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నవదీప్ కూడా ఒకరు. ఒకప్పుడు జై, గౌతమ్ SSC, చందమామ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా అచ్చేసిన నవదీప్ ఆ తర్వాత సెకండ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయాడు. నవదీప్ చివరిసారిగా 2021లో మోసగాళ్లు సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ పెట్టి వరుసగా పలు ఓటీటీలలో సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు. న్యూసెన్స్ అనే సిరీస్ తో ఆహా ఓటీటీలో ప్రేక్షకులని అలరించాడు. ఇందులో నవదీప్, బిందుమాధవి జంటగా నటించారు. ఇప్పుడు సరికొత్త రియాలిటీ షోతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
క్రికెట్ థీమ్‌తో త్వరలో ఓటీటీలోకి రానున్న రియాలిటీ గేమ్ షో పేరు డగౌట్ కాగా, . రోల్ టు రూల్ అనేది క్యాప్షన్. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. “చేతిలో ఆట, ఆటలో వేట.. ఇక క్రికెట్ పండుగే ప్రతీ చోట” అని రాసుకొస్తూ ప్రముఖ ఓటీటీ ఆహాలో డగౌట్ రియాలిటీ షోను నవంబర్ 18న రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. టీజర్‌లో “క్రికెట్ అంటే గేమ్ కాదు.. ఒక ఎమోషన్”, “రోల్ చేసేది సెలబ్రిటీలు.. రూల్ చేసేది మనం” అంటూ నవదీప్ చెప్పుకురాగా, ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తుంటే ఆయన సెలబ్రిటీలతో కలిసి క్రికెట్ గురించి చర్చలు జరుపుతాడా అని అందరి మదిలో కదులుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…