Alia Bhatt : కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంట పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.వీరు ఇద్దరు కూడా బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో ఒకరు.గత ఏడాది ముంబైలో వారి సన్నిహిత కుటుంబ సభ్యులు హాజరైన ప్రైవేట్ వేడుకలో వారు పెళ్లి చేసుకున్నారు. అయితే రణ్‌బీర్‌కి చాక్లెట్ బాయ్ గా పేరుంది. ఇంత గ్లామర్‌గా ఉండే అతను అలియాని పెళ్లి చేసుకోకముందు చాలా మంది హీరోయిన్స్‌తో ఎఫైర్‌లో ఉన్నాడనే ప్రచారం జరిగింది. బచ్నా ఏ హసీనో (2008)లో కలిసి నటించినప్పుడు రణ్‌బీర్, దీపిక ప్రేమలో పడ్డారు. 2010లో రణ్‌బీర్ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడని పుకార్లు రావడంతో దీపికా అతనికి బ్రేకప్ ఇచ్చేసింది.
అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ (2009)లో కలిసి నటించిన తర్వాత రణ్‌బీర్, కత్రినా కొన్నాళ్లు డేటింగ్‌లో ఉండగా, వారిరివరు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసారు.కానీ అయితే, 2016లో వారు విడిపోయారు. అనంతరం రణ్‌బీర్ తన రాక్‌స్టార్ (2011) సహనటి నర్గీస్ ఫక్రీతో రిలేషన్ పెట్టుకున్నాడు. మహరీ ఖాన్, అమీషా పటేల్, ఏంజెలా జాన్సన్, శృతి హాసన్, అవంతిక మాలిక్, సోనమ్ కపూర్, నందిత మహతాని వంటి వారితో ఎఫైర్లు పెట్టుకున్నాడని అనేక ప్రచారాలు వచ్చాయి. ఇటీవల రణ్‌బీర్‌పై దీనిపై బాగా ట్రోలింగ్ నడిచింది. ఇక రణబీర్ కపూర్ కు అలియా లిప్ స్టిక్ వేసుకోవడం ఇష్టముండదట. దీనికి ‘టాక్సిక్’ అని ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేశారు కొందరు. దీనిపై ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
కరణ్ జోహార్.. ‘కాఫీ విత్ కరణ్’ షోకి వచ్చిన అతిధులను పలు వ్యక్తిగత ప్రశ్నలు అడిగి ఇబ్బుందులు పెడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రణ్‌బీర్ కపూర్‌ను ‘టాక్సిక్’ అని చాలా మంది ట్రోల్ చేస్తున్నప్పటికీ ఇన్నాళ్లు రణ్‌బీర్‌తో పాటు అలియా మౌనంగా ఉంది. తాజాగా మాత్రం స్పందించింది.. రణ్‌బీర్ కపూర్‌పై ‘ఇలా జరగడం నాకు బాధగా ఉంది. ఎందుకంటే రణబీర్ కపూర్ వ్యక్తిత్వం నాకు తెలుసు. నా మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నా సహచరులు కూడా నాతో చెప్పారు. కానీ రణ్ బీర్ కపూర్ పై తప్పుడు కథనాలు రాసారు. ప్రపంచంలో దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి’ అని అలియా భట్ కాస్త బాధపడుతూ చెప్పుకొచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…