వినోదం

Nagarjuna : న‌రేష్‌ని పరిచ‌యం చేయ‌క‌పోతే మాటొచ్చేస్త‌ది.. నాగార్జున ఆస‌క్తిక‌ర కామెంట్స్..

Nagarjuna : అక్కినేని నాగార్జున ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా సక్సెస్‌లు అందుకోలేక‌పోతున్నాడు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఎవ‌రు కూడా మంచి హిట్స్ ఇవ్వ‌క‌పోతున్న నేప‌థ్యంలో వారి ఫ్యాన్స్ ఒక మంచి హిట్ అందించాల‌ని కోరుతున్నారు.ఈ క్ర‌మంలో అక్కినేని నాగార్జున త్వ‌ర‌లో వారి ఫ్యాన్స్‌ని ఫుల్‌గా సంతోష‌ప‌ర‌చ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున నటిస్తున్న పూర్తిస్థాయి మాస్‌ చిత్రం ‘నా సామిరంగ’. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా న‌టిస్తుండ‌గా.. విజయ్‌ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్‌ను చిత్రబృందం విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోషన్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ అంజి అనే ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని తెలిపింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ.. మా అంజి గాడ్ని ప‌రిచ‌యం చేస్తున్నాం లేదంటే మాటోచ్చేత్త‌ది అంటూ రాసుకోచ్చింది. ఇది కేవలం పాత్రను పరిచయం చేయడానికే కాదు, అల్లరి నరేష్‌తో నాగార్జునకు ఉన్న రిలేషన్ ని చాలా అద్భుతంగా చూపించింది. గ్లింప్స్ ని చూస్తే నరేష్, నాగార్జునతో స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకునే సరదా వ్యక్తిగా కనిపించారు.

Nagarjuna

వీడియో లో అల్లరి నరేష్ ఎనర్జిటిక్ గా కనిపించారు. కింగ్ నాగార్జున తో కాంబినేషన్ సీన్లు బాగున్నట్టు తెలుస్తోంది. మరోసారి అల్లరి నరేష్ తనదైన మార్క్ ను ఈ అంజి పాత్రతో వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అల్ల‌రి న‌రేష్ హీరోగానే కాకుండా స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో న‌టిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ చిత్రంలోను అల్ల‌రి న‌రేష్ త‌న పాత్ర‌తో ఎంత‌గానో అలరించ‌నున్నాడ‌ని అంటున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, అషికా రంగనాథ్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM