Nagarjuna : అక్కినేని నాగార్జున ఇటీవలి కాలంలో పెద్దగా సక్సెస్‌లు అందుకోలేకపోతున్నాడు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఎవరు కూడా మంచి హిట్స్ ఇవ్వకపోతున్న నేపథ్యంలో వారి ఫ్యాన్స్ ఒక మంచి హిట్ అందించాలని కోరుతున్నారు.ఈ క్రమంలో అక్కినేని నాగార్జున త్వరలో వారి ఫ్యాన్స్‌ని ఫుల్‌గా సంతోషపరచనున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ చిత్రం ‘నా సామిరంగ’. ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ అంజి అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం లేదంటే మాటోచ్చేత్తది అంటూ రాసుకోచ్చింది. ఇది కేవలం పాత్రను పరిచయం చేయడానికే కాదు, అల్లరి నరేష్‌తో నాగార్జునకు ఉన్న రిలేషన్ ని చాలా అద్భుతంగా చూపించింది. గ్లింప్స్ ని చూస్తే నరేష్, నాగార్జునతో స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకునే సరదా వ్యక్తిగా కనిపించారు.

వీడియో లో అల్లరి నరేష్ ఎనర్జిటిక్ గా కనిపించారు. కింగ్ నాగార్జున తో కాంబినేషన్ సీన్లు బాగున్నట్టు తెలుస్తోంది. మరోసారి అల్లరి నరేష్ తనదైన మార్క్ ను ఈ అంజి పాత్రతో వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగానే కాకుండా సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ చిత్రంలోను అల్లరి నరేష్ తన పాత్రతో ఎంతగానో అలరించనున్నాడని అంటున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, అషికా రంగనాథ్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.