Naga Chaitanya : తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది స్టార్లు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయగా, యువ సామ్రాట్ నాగ చైతన్య ‘జోష్’ అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు… ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్నాడు. మధ్యలో కాస్త డౌన్ అయినా మళ్లీ వరుస హిట్‌లను అందుకుని సత్తా చాటుకున్నాడు. సమంత నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి నాగ చైతన్యకి హిట్స్ అనేవి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అతడు ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. ఇది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సూపర్ రెస్పాన్స్ రావడంతో హిట్ అయింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు.
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్ అనే చిత్రం రూపొంతుంది. . సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే దీన్ని అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ కర్ణాటక లోని గోకమా ప్రాంతంలో జరుగుతుంది.మరి ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో సాయి పల్లవి కూడా అడుగు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే నాగ చైతన్యకి ఫుడ్ అంటే చాలా ఇష్టమని అందుకే ఆయన హైదరాబాద్ లో షోయూ అనే రెస్టారెంట్ ప్రారంభించాడు.

తనకు నచ్చిన ఫుడ్ గురించి వెల్లడించాడు చైతూ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అచ్చమైన తెలుగు తిండి తింటానన్నాడు చైతూ.. వైట్ రైస్.. ముద్దపప్పులో నెయ్యివేసుకుని ఆరగిస్తానని అన్నాడు. అంతే కాదు ముద్దు పప్పు..పచ్చిపులుసు కాంబినేషన అంటే చాలా ఇష్టమని, .. వాటికి సైడ్ డిష్ లు గా మటన్ కాని..రొయ్యల ప్రై కాని తీసుకుంటాడట. అప్పుడప్పుడు జపనీస్ ఫుడ్ కూడా తింటాడట చైతూ.. ఇక చైతూ ఫుడ్ హ్యాబిడ్స్ తెలుసుకుని ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. మన తెలుగు హీరోలు ఇలా తెలుగు వంటలని ఇష్టపడడం టూ గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు.