Mrunal Thakur : బాలీవుడ్ అందాల ముద్దుగమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం చిత్రంలో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రాళ్ల హృదయాలని కట్టిపడేసింది. హిందీలో సీరియల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమా రీమేక్ గా వచ్చిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత తెలుగులోకి వచ్చిన ఈ భామ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో మృణాల్ సీత మహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆయిపోయింది.
హాయ్ నాన్న సినిమాలో నానికి జోడిగా నటించి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మృణాల్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా మృణాల్ ఠాకూర్ కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలో ఆమె పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చింది. ‘ఫ్యామిలీ స్టార్’ షూట్‌లో భాగంగా మృణాల్ ప్రస్తుతం న్యూజెర్సీలో ఉన్నారు. ‘హాయ్ నాన్న’కు వస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులతో కాసేపు మాట్లాడేందుకు అక్కడి థియేటర్‌కు వెళ్లారు. ‘సీతారామం’ నుంచి న్యూజెర్సీ తనపై ఎంతో ప్రేమను కురిపిస్తోందని.. ‘హాయ్ నాన్న’తో ఇక్కడి ప్రేక్షకులను కలవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.

ఇంతలో అక్కడే ఉన్న ఓ పిల్లాడు.. ”మీకు పెళ్లైందా?” అని ప్రశ్నించాడు. ఆ మాటలకు నవ్వులు పూయించిన ఆమె ”త్వరలోనే.. త్వరలోనే.. పెళ్లి చేసుకుంటా” అని బదులిచ్చారు. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మృణాల్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటుందా, లేకుంటే బయట వ్యక్తిని చేసుకుంటుందా అనే దానిపై క్లారిటీ రానుంది.