వినోదం

Sardar : స‌ర్దార్ అనే టైటిల్‌తో వ‌చ్చిన మూవీలు ఇవే.. వీటిలో ఏవి హిట్ అయ్యాయంటే..?

Sardar : స‌ర్దార్.. అనే పదం వినడానికి ఎంతో ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది. సర్దార్ అనే పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే స‌ర్దార్ అనే టైటిల్ త‌గిలించుకుని వెండి తెర పైకి వచ్చిన ఏ చిత్రాలు హిట్.. ఏ చిత్రాలు ప్లాప్.. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిగా సర్దార్ అనే పేరుతో వచ్చిన చిత్రం సర్దార్ పాపారాయుడు. దాస‌రినారాయ‌ణ రావు ద‌ర్శ‌క‌త్వంలో నటసార్వభౌమ ఎన్టీఆర్ హీరోగా 1980 సంవ‌త్స‌రంలో స‌ర్దార్ పాపారాయుడు అనే సినిమా వ‌చ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీదేవి హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం నటించి ప్రేక్షకులను అలరించారు. అక్టోబర్ 30, 1980 లో దీపావళి కానుకగా విడుదలైన సర్దార్ పాపారాయుడు  బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచి భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

Sardar

1987లో రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు హీరోగా భాస్క‌ర రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం స‌ర్దార్ ధ‌ర్మ‌న్న. ఈ సినిమాలో కృష్ణంరాజు సరసన రాధిక‌, జ‌య‌సుధ హీరోయిన్స్ గా న‌టించారు. ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ కాలేకపోయింది. ఇక సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా ఏ. కోదండిరామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 1987లో స‌ర్దార్ కృష్ణ‌మ‌నాయుడు సినిమా విడుదలయ్యింది. ఈ సినిమాలో విజ‌య‌శాంతి హీరోయిన్ గా నటించారు.  ఊర్వ‌శి,శార‌ద‌లు ముఖ్య‌పాత్ర‌లలు పోషించారు. ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది.

2016లో కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని గ‌బ్బ‌ర్ సింగ్ హిట్ త‌ర‌వాత దానికి కొన‌సాగింపుగా తెర‌కెక్కించారు. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఖైదీ చిత్రం తర్వాత ఈ నెల 21న దీపావళి పండుగ కానుకగా వచ్చిన కార్తీ శివకుమార్ చిత్రం సర్దార్. ఈ చిత్రంలో కార్తీ.. విజయ్ కుమార్ అనే క్యారెక్టర్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా, గూడచారిగా ద్విపాత్రాభినయంలో నటించారు.  ఈ నెల అక్టోబర్ 21 న విడుదలైన సర్దార్ చిత్రం సక్సెస్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM