వినోదం

నాగార్జున శివ మూవీ గురించి అప్ప‌ట్లో వారు ఏమ‌నుకున్నారో తెలుసా..?

శివ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక కల్ట్ క్లాసిక్‌గా ఇప్పటికి గుర్తుంటుంది మరియు ఇది అనేక చిత్రాలకు థీసిస్ గా నిలిచింది. ఈ సినిమా నాగార్జునని టాలీవుడ్‌లో స్టార్‌గా కూడా నిలబెట్టింది. శివ సినిమా కాలేజీలో జ‌రిగే గొడ‌వ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. అప్పటిలో చైన్ ఫైట్ లు కూడా ఈ సినిమాతోనే మొద‌ల‌య్యాయి. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన కొన్ని రికార్డుల‌ను ఇప్ప‌టికీ ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోతుంది. ఈ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ కూడా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు వచ్చింది.

ఆర్జీవీ క‌లెక్ట‌ర్ గారి అబ్బాయి, రావుగారిల్లు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలోనే నాగార్జునతో వ‌ర్మ‌కు ప‌రిచ‌యం ఏర్పడింది. ఆ త‌ర‌వాత రాత్రి అనే క‌థ‌ను నాగార్జునకు వినిపించాడు. కానీ ఆర్జీవీ చెప్పిన కథ నాగార్జునను ఆకట్టుకోలేకపోయింది. ఆ త‌ర‌వాత ఆర్జీవీ త‌న కాలేజీ రోజుల నుండి ఒక క‌థ‌ను త‌యారుచేశాడు. ఆ క‌థ‌ను నాగార్జునకు వినిపించడం జరిగింది. స్టోరీ భాగా న‌చ్చ‌డంతో వెంట‌నే నాగార్జున కూడా చిత్ర కథకు ఓకే చెప్పేశారు. ఇక ఇదే క‌థ‌ను త‌నికెళ్ల‌బ‌ర‌ణికి కూడా వినిపించారు వర్మ.

ఈ క‌థ విన్న త‌నికెళ్ల‌భ‌రణి కూడా మొదట ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. అప్పటికే కొన్ని సినిమాల‌కు డైలాగ్ రైట‌ర్ గా పనిచేసిన త‌నికెళ్ల‌భ‌ర‌ణిని శివ సినిమాకు కూడా డైలాగులు రాయ‌మ‌న్నారు. దాంతో భరణి క‌థ‌ను బ‌ట్టి కొన్ని కామెడీ డైలాగుల‌ను కూడా జత చేయడం జరిగిందట. కానీ వ‌ర్మ ఈ క‌థ‌లో ఒక్క కామెడీ సీన్ కూడా ఉండ‌ద‌ని చెప్పార‌ట‌. వర్మ మాటలు విన్న త‌నికెళ్ల‌భ‌ర‌ణి ఈ సినిమా ఆడిన‌ట్టే అని మ‌న‌సులో అనుకున్నార‌ట‌. అంతే కాకుండా వర్మ గురించి వీడికేమైనా పిచ్చా అని కూడా అనుకున్నార‌ట‌. కానీ ఆర్జీవి కోరిన‌ట్టుగా మాట‌లు రాసి ఇచ్చారట తనికెళ్ల భరణి.

ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా అమ‌లని హీరోయిన్ గా అనుకున్నారు. ఇక విల‌న్ పాత్ర కోసం ర‌ఘువ‌రుణ్ ను తీసుకున్నారు. భ‌వాని అనే పాత్ర‌లో ర‌ఘువ‌రుణ్ న‌టనకు వీక్షకుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే పూర్తి చేసుకుంది. సినిమా రీరికార్డింగ్ కు ముందు చూసిన నిర్మాత‌లు కూడా సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని అనుకున్నారట. అంతేకాకుండా టైటిల్ విష‌యంలో కూడా పెద‌వివిరిసారట. అలా తెర‌కెక్కిన శివ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ 1989 వ సంవత్సరంలో విడుదలై ఆల్ టైం ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది.

Share
Mounika

Recent Posts

How To Increase Breast Milk : ఈ ఆహారాల‌ను తింటే చాలు.. బాలింత‌ల్లో స‌హ‌జ‌సిద్ధంగా పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి..!

How To Increase Breast Milk : గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న సంగ‌తి తెలిసిందే. కాస్త…

Saturday, 18 May 2024, 8:47 PM

Telugu OTT : ఈ వారం ఓటీటీల్లో 7 సినిమాలు.. వాటిల్లో 4 బాగా స్పెష‌ల్‌.. స్ట్రీమింగ్ వేటిలో అంటే..?

Telugu OTT : వారం వారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో…

Saturday, 18 May 2024, 6:18 PM

Eggs In Summer : వేస‌విలో కోడిగుడ్ల‌ను తిన‌డం మంచిది కాదా..?

Eggs In Summer : గుడ్డు ఒక ఆరోగ్యకరమైన మరియు సూపర్ ఫుడ్. ఎందుకంటే విటమిన్ బి12, బి6, బి5,…

Saturday, 18 May 2024, 11:42 AM

Lemon Buying : నిమ్మ‌కాయ‌ల‌ను కొంటున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Lemon Buying : నిమ్మకాయల‌ను భారతీయులు ఇంట్లో మరియు వంటగదిలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. రుచిలో పుల్లగా ఉండే నిమ్మకాయలు…

Saturday, 18 May 2024, 9:04 AM

Hibiscus Tea : మందార పువ్వుల టీని రోజూ తాగితే.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Hibiscus Tea : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు క‌నిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని అంద‌మైన పుష్పాలు పూస్తాయి.…

Friday, 17 May 2024, 7:53 PM

Whiten Teeth : ఈ నాచుర‌ల్ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ దంతాలు తెల్ల‌గా మెరిసిపోతాయి..!

Whiten Teeth : మ‌న శ‌రీరంలోని అవ‌య‌వాల్లో దంతాలు కూడా ఒక‌టి. చాలా మంది వీటి ఆరోగ్యంపై దృష్టి పెట్ట‌రు.…

Friday, 17 May 2024, 6:17 PM

Sitting In Temple : ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కాసేపు అందులో కూర్చోవాలి.. ఎందుకంటే..?

Sitting In Temple : మన దేశంలో ప్రతి ఇంట్లోనూ దేవుడికి చిన్నపాటి గుడి అయినా కచ్చితంగా ఉంటుంది. ఇల్లు…

Friday, 17 May 2024, 3:11 PM

Work From Home Scam : వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ స్కామ్‌.. 4 రోజుల్లో రూ.54 ల‌క్ష‌లు పోగొట్టుకున్న మ‌హిళ‌..

Work From Home Scam : సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌స్తుత త‌రుణంలో ఎంత‌గా ఉందో అంద‌రికీ తెలిసిందే. అయితే…

Friday, 17 May 2024, 11:30 AM