Most Watched Web Series : కరోనా తర్వాత ఓటీటీల హంగామా ఎక్కువైంది. థియేటర్స్ లో సినిమాలు చూడటం కంటే ఓటీటీలో సినిమాలు చూడటానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీలకి ఆదరణ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పదుల సంఖ్యలో ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇక ఆ ఓటీటీలలో కొన్ని సినిమాలు డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి సందడి చేస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్ లు అయితే ప్రతి వారం ఎన్నో సందడి చేస్తున్నాయి. చిన్న చిన్న నటీనటుల దగ్గర నుంచి స్టార్ హీరోలు హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నారు. ముఖ్యంగా హిందీ , తెలుగు భాషల్లో వెబ్ సిరీస్ లు ఎక్కువగా వస్తున్నాయి.
ఇటీవలి కాలంలో చాలా మంది ఓటీటీ కంటెంట్‌కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్న నేపథ్యంలో ఇండియాలో అత్యధిక మంది ఓ వెబ్ సిరీస్‌ని ఎక్కువగా చూసారు. ఇంతకు ఆ వెబ్ సిరీస్ ఎదో తెలుసా..ఫర్జీ ఇండియాలో ఈ వెబ్ సిరీస్ ను ఏకంగా 4 కోట్లమంది చూశారట. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సౌత్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన ఫర్జీ ఎంతో మంది ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ట్రాకింగ్ ఏజెన్సీ ఓర్మాక్స్ మీడియా ఒక్క సీజన్‌లో వచ్చిన వ్యూస్ ఆధారంగా ఇండియాలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ల లిస్ట్ ను తీయగా, ఇందులో ఫర్జీ మొదటి స్థానంలో నిలిచింది.

ఇప్పటికే బాలీవుడ్ ఓటీటీలో అదరగొట్టిన సేక్రేడ్ గేమ్స్, మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లను దాటేసి ఫర్జీ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా ఈ వెబ్ సిరీస్ 4 కోట్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నటీనటుల నటనతో పాటు కంటెంట్ కూడా అందరికి నచ్చడంతో ఈ వెబ్ సిరీస్ తెగ సందడి చేస్తుంది. మరి మీరు కూడా ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ చూడకపోతే చూసి ఎంజాయ్ చేయండి.