Most Searched Movies in 2023 : మరి కొద్ది రోజులలో 2023 ముగియనుంది. చూస్తుండగానే ఈ ఏడాది చివరి దశకు వచ్చేసింది. అయితే ఏడాది చివరికి వచ్చిన నేపథ్యంలో అందరు కూడా పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటున్నారు. సినీ రంగం విషయానికి వస్తే ఎప్పటిలాగే ప్రతి ఏడాదికి సంబంధించిన టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ బయటకు తీసారు. గూగుల్ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లిస్ట్ రిలీజ్ చేయగా, ఇందులో షారుక్ ఖాన్ డామినేట్ చేశాడు. ఇక సౌత్ నుండి చూస్తే కేవలం మూడే సినిమాలు ఉన్నాయి. ఆ మూడు కూడా తమిళ సినిమాలు కావడం విశేషం. తెలుగు సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇందులో చోటు దక్కించుకోలేదు.
లిస్టులో జవాన్ టాప్ లో ఉండగా.. మరో షారుక్ ఖాన్ మూవీ పఠాన్ ఐదో స్థానంలో నిలిచింది. ప్రభాస్ ఆదిపురుష్ కోసం కూడా నెటిజన్లు బాగానే సెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ చూస్తే అందులో ముందుగా జవాన్, ఆ తర్వాత గదర్ 2, ఓపెన్‌హైమర్, ఆదిపురుష్, పఠాన్, ది కేరళ స్టోరీ, జైలర్, లియో, టైగర్ 3, వారిసు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఓటీటీ షోలు చూస్తే ఇందులో వెబ్ సిరీస్ ఫర్జీ టాప్ లో ఉండగా.. వెంకటేశ్, రానా కలిసి నటించిన రానా నాయుడు కూడా చోటు దక్కించుకుంది.

ఫర్జీ, వెన్స్‌డే, అసుర్, ,రానా నాయుడు, ద లాస్ట్ ఆఫ్ అజ్, స్కామ్ 2003, బిగ్ బాస్ 17, గన్స్ అండ్ గులాబ్స్, సెక్స్ లైఫ్, తాజా ఖబర్ ఉన్నాయి. మొత్తానికి ఈ ఏడాది బాలీవుడ్ పర్వాలేదనిపించింది. ముఖ్యంగా షారూఖ్ ఖాన్ బీటౌన్ పరువు నిలబెట్టాడు. మరి వచ్చే ఏడాది అయిన మన తెలుగు హీరోలు సత్తా చాటతారా లేదా అనేది చూడాల్సి ఉంది.