Miss Shetty Mr Polishetty OTT Release Date : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా థియేటర్లలో రిలీజ్ అయి, మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలోకి రావడానికి సిద్ధమయింది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలలో కనబడి, బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో, ఓటిటిలోకి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూశారు. సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి హిట్ కొట్టేసింది.
కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. ఈ సినిమా అక్టోబర్ 5 అనగా నేడు ఓటిటిలోకి అడుగుపెట్టనుంది. నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ఫారంలో రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకి పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా ఆకట్టుకుంది, అనుష్క నటన కూడా చాలా బాగుంది.

మురళీ శర్మ, అభినవ గోమటం, నాజర్, సోనియా దీప్తి, జయసుధ, తులసి తదితరులు నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీ ని నిర్మించింది. గోపి సుందర్, రధన్ సంగీతాన్ని అందించారు. ఒక ప్రముఖ చెఫ్ గా అన్విత రళి శెట్టి (అనుష్క శెట్టి) పెళ్లి చేసుకోకుండా తల్లి అవ్వాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఇండియాకి వస్తుంది. స్టాండర్డ్ కమెడియన్ అయిన సిద్దు పోలిశెట్టి ని ఆమె కలుస్తుంది. అతని లక్షణాలు ఆమెకి నచ్చుతాయి. దీంతో, తల్లి అవ్వాలని అనుకుంటుంది. అన్వితని సిద్దు ప్రేమిస్తాడు. చివరికి ఏం జరుగుతుంది..? ప్రేమ గెలిచిందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాలి.