Martin Luther King OTT Release Date : బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హృదయ కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన సంపూ రీసెంట్‌గా మార్టిన్ లూథర్ కింగ్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైన పొలిటికల్ సెటైరికల్ డ్రామా కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ 17 లేదా 24లలో ఈ మూవీ సోనీ లివ్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.
మార్టిన్ లూథర్‌కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో పాటు సీనియర్ నరేష్, డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమా కథ విషయానికి వస్తే..వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరిని సర్పంచ్ ఎందుకు పెళ్లి చేసుకొన్నాడు? ఇద్దరు కుమారులు జగ్గు, లోకి వారసత్వ రాజకీయాలు, అధిపత్య పోరు చూసి సర్పంచ్ ఎందుకు మనస్తాపం చెందాడు. చెప్పులు కుట్టుకొనే ఎడ్డోడికి ఆధార్ కార్డు, ఓటరు కార్డు ఎందుకు కావల్సి వచ్చింది? ఎడ్డోడిగా పిలిచే మోచీకి మార్టిన్ లూథర్ కింగ్ అని పోస్టు మాస్టర్ (శరణ్య) ఎందుకు పేరు పెట్టింది? మార్టిన్ లూథర్ కింగ్‌కు ఆధార్, ఓటర్ కార్డు వచ్చిన తర్వాత వచ్చిన ఎదురుపడిన సమస్యలు ఏమిటి? సర్పంచ్ ఎన్నికలు మార్టిన్ లూథర్ కింగ్ ప్రాణాల మీదకు రావడానికి కారణం ఏమిటి? సర్పంచ్ ఎన్నికల్లో మార్టిన్ లూథర్ కింగ్ ప్లాన్ వర్కవుట్ అయిందా? అనే ప్రశ్నలకు సమాధానమే మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కథ.
చిత్రంలో చెప్పులు కుట్టుకొంటూ.. బిక్షాటన చేసి జీవితాన్ని గడిపే చర్మకారుడిగా సంపూ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఏ మాత్రం గ్లామర్‌కు ఛాన్స్ లేని పాత్రతో ప్రేక్షకులకు చైతన్యం కలిగించే పాత్రలో నటించి మెప్పించాడని చెప్పాలి. సంపూ హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. ఇప్పటి వరకు చూడని సంపూని నటనపరంగా చూసే అవకాశం లభించింది. జగ్గూగా వీకే నరేష్, లోకేష్‌గా వెంకటేష్ మహా సినిమాకు బలంగా మారారు. సంపూ అసిస్టెంట్‌గా నటించిన అబ్బాయి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకొన్నాడు. శరణ్య, సర్పంచ్‌గా నటించిన వ్యక్తితోపాటు ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…