Leo Movie OTT Release Date : ఇలయదళపతి విజయ్ గురించి ప్రత్యేకపరిచయాలు అక్కర్లేదు. ఆయనకు తమిళంతో పాటు ఇతర భాషలలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజైన ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.450 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేందుకు ఉరకలు వేస్తోంది.. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యిందని టాక్ వినిపిస్తోంది. అయితే థియేటర్.. ఓటీటీ విడుదలకు కాస్త ఢిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
లియో మూవీ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుండగా, ఈ మూవీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే వచ్చే గురువారం (నవంబర్ 16) నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాని ఇంతవరకు క్లారిటీ లేదు. అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా.. ఆ మధ్య ఆన్‌లైన్లో లీకైందని, అందుకే అనుకున్నదాని కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని ప్రచారం జరిగిన కూడా అది జరగలేదు. మరి కొద్ది రోజులలో దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.ఇక లియా సినిమాకి లోకేష్, రత్న కుమార్, దీరజ్ వైద్యుడు స్క్రీన్ ప్లే అందించారు. యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు.
లోకేష్ తెరకెక్కించిన సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ, విక్రమ్ సినిమాల తర్వాత విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ఇప్పటి వరకు విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు వసూళ్లు కాస్త డల్ అయ్యాయి. మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…