వినోదం

Mangalavaram Movie OTT Rights : మంగ‌ళ‌వారం ఓటీటీ హ‌క్కుల కోసం పోటీ.. భారీ రేటుతోనే..

Mangalavaram Movie OTT Rights : ఆర్ఎక్స్‌100 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్. ఈ సినిమా త‌ర్వాత పాయ‌ల్ చాలా సినిమాలు చేసిన కూడా ఏ సినిమా కూడా ఈ అమ్మ‌డికి అంత పేరు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. దీంతో పాయ‌ల్ ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌కి తొలి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తితో క‌లిసి మంగ‌ళ‌వారం అనే సినిమా చేసింది. ఈ సినిమా గత కొద్ది రోజులుగా అంద‌రి అటెన్ష‌న్‌ని తిప్పుకుంటుంది. ఈ సినిమా ఫంక్షన్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడం మరో ఎత్తు కాగా, ఆయ‌న చేసిన కామెంట్స్‌తో సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో పెరిగాయి.

పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో నటించిన మంగ‌ళ‌వారం సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్రంకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక పాయల్ రాజ్ పుత్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో ఈ భామ‌ మరోసారి రెచ్చిపోయి బోల్డ్ సీన్స్ లో నటించింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పాటు నందితా శ్వేతా, దివ్యా పిళ్ళై, అజేయ గోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Mangalavaram Movie OTT Rights

మంగ‌ళ‌వారం చిత్రంకి మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ బాగానే క‌నిపిస్తుంది. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వ‌చ్చి అల్లు అర్జున్ స‌పోర్ట్ చేయ‌గా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను కూడా అల్లు అర్జున్ ఓటీటీ అయిన ఆహానే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భారీ ధరకు ఈ సినిమాను సొంతం చేసుకుందని తాజా సమాచారం. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. అజనీష్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌లో ఆయన కొట్టిన బీజీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఎందుకంటే ‘కాంతార’ సినిమా విజయంలో మ్యూజిక్, బీజీ కీ రోల్ పోషించాయి. ఇప్పుడు మంగళవారం సినిమాకి కూడా ఇది గట్టిగా ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM