Mangalavaaram OTT Release : ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా తర్వాత పాయల్ ఖాతాలో ఒక్క హిట్ కాలేదు. కాని తాజాగా మంగళవారం చిత్రంతో మంచి హిట్ కొట్టింది. దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇటీవల ఈ దర్శకుడు ‘మహా సముద్రం’ అనే సినిమా చేసాడు, కానీ అది పెద్దగా హిట్ కాలేదు. అందులో శర్వానంద్, సిద్ధార్థ్ లాంటి ఇద్దరు మంచి నటులున్న, అదితి రావు హైదరి లాంటి నటి వున్నా కూడా ఎందుకో ఈ చిత్రం జనాలకి పెద్దగా ఎక్కలేదు. ఇక ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి మంగళవారం అనే సినిమా చేశాడు. ఇది నవంబర్ 17న థియేటర్స్ లో విడుదలైంది.
విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన మంగళవారం సినిమా ఈ ఏడాది హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో ఈ సినిమా నవంబరు 17న రిలీజ్ అయింది. అయితే, క్రికెట్ వరల్డ్ కప్ సమయం కావడంతో థియేటర్లలో పెద్దగా ఆడలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంగళవారం నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఓటీటీలో ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసింది. మంగళవారం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోంది.

సినిమా కథ విషయానికి వస్తే.. ఆంధ్రాలోని ఓ పల్లెటూరులో 1996 లో జరిగిన మిస్టరీ హత్యలే ప్రధానాంశం. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని గుర్తుతెలియని వ్యక్తులు గోడ మీద పేర్లు రాయడం, ఆ మరుసటి రోజే వాళ్లిద్దరూ చనిపోవడం ఊళ్లో సంచలనం సృష్టిస్తుంది. ఇలా వరుస మరణాలతో ఊళ్లో కలకలం రేగుతుంది. ఇవి హత్యలా.. పరువుపోయిందని వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడ్డారా.. గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు.. ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్ పుత్) కు ఉన్న సంబంధం ఏంటనేది చిత్ర కథ. అయితే ఈ హత్యల వెనకున్న మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.