Manchu Lakshmi : మంచు ఫ్యామిలీ ఎన్ని సార్లు ట్రోల్స్ కి గురైన కూడా వారు కొంత అతి చేస్తూ విమర్శల బారిన పడుతూనే ఉంటారు. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి తమ అసందర్భ వ్యాఖ్యలతో పాటు విచిత్ర చేష్టలతో విమర్శలకు గురవుతూ ఉంటారు. తాజాగా మరోసారి మంచు లక్ష్మిని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. ఫిబ్రవరి 9న అక్కినేని హీరో సుమంత్ బర్త్ డే. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫోటో షేర్ చేసింది.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్. ఈ ఏడాది నీకు మంచి జరగాలి అంటూ కామెంట్ చేసింది. అయితే ఆమె షేర్ చేసిన ఫొటోలో మంచు లక్ష్మిని సుమంత్ కౌగిలించుకొని ఉండగా… ఆమె స్మైల్ ఇచ్చారు.
‘మోహన్ బాబు గారు ఎప్పుడూ డిసిప్లిన్ అంటారు. ఇలాగే ఉంటదా డిసిప్లిన్’, ‘గుడ్.. వెరీ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీ.. యాక్ తూ’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మేడం మీరు మేడం అంతే అంటే ఆమెని ఏకి పారేస్తున్నారు. మంచు లక్ష్మీని ఎంత విమర్శించిన కూడా ఆమె తన చేష్టలతో వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. ఫొటోలో తప్పుబట్టాల్సినంత మేటర్ లేకపోయినప్పటికీ పరిస్థితులు, ప్రాంతాన్ని బట్టి నడుచుకోవాలి. మన ఇండియన్ సొసైటీలో బ్రదర్ ని హగ్ చేసుకున్నా కొందరు హర్షించరు. వయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయి కొంచెం డిస్టెన్స్ మైంటైన్ చేయాలి అని అందరు అనుకుంటారు.

మంచు లక్ష్మి ఏకంగా సుమంత్ ని కౌగిలించుకొని ఫోటో దిగడమే కాకుండా డార్లింగ్ అంటూ రొమాంటిక్ పదం వాడింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ విమర్శలు మంచు లక్ష్మి అసలు పట్టించుకోరు. ఇండస్ట్రీలో సత్తా చాటాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న మంచు లక్ష్మీకి సరైన సక్సెస్ లు రావడం లేదు. సినిమాలు, టీవీ షోస్, వెబ్ సిరీస్‌లతో ఈ ముద్దుగుమ్మ రచ్చ చేస్తుంది. ఇటీవల పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంది.