Mamta Mohandas : సాధారణంగా హీరో హీరోయిన్లు లేదంటే సెలబ్రెటీలు ఎవరైనా సరే, ఏదో ఒక కారణంతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. రకరకాల రూమర్లు కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా, సెలబ్రిటీలపై సోషల్ మీడియా దాడులు బాగా పెరిగిపోయాయి. హీరోయిన్లు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నాలుగైదు రోజుల కిందట రష్మిక ఫేక్ వీడియో గురించి ఎంత బాధ పడ్డారో చూసాం. ఈ వీడియో పై టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటుగా రాజకీయ నాయకులు కూడా స్పందించారు. తర్వాత కత్రినా కైఫ్ వీడియో ఒకటి వైరల్ అయింది.
హీరోయిన్స్ ఏ కాదు. హీరోల పరిస్థితి కూడా అలానే మారిపోయింది. రూమర్లు, మార్ఫింగ్ వీడియోలపై సెలబ్రిటీలు అంతా కూడా, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఇలాంటి సంఘటన ఇంకొకటి చోటుచేసుకుంది. టాలీవుడ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఆమె మనకి సుపరిచితమే. ఆమె ఆరోగ్యం గురించి, రాసిన ఒక తప్పుడు వార్త సోషల్ మీడియాని కుదిపేస్తోంది.

ఇది చూసిన ఆమె, కోపంతో ఊగిపోతోంది. అబద్దపు వార్తలని సృష్టించి పరువు తీస్తున్నందుకు ఆమె మండిపడుతోంది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి, రోజు రోజుకి ఎన్నో ఫేక్ వార్తలు తెగ వైరల్ అయిపోతున్నాయి. రూమర్స్ తో యాక్టర్ల పరువు తీస్తున్నారు. ఇలా, తప్పుడు వార్తలు రాసి ఎంతో డబ్బులు సంపాదించుకోవచ్చు అని, చాలామంది అనుకుంటున్నారు. కానీ, అవేమో సెలెబ్రిటీల్ని చాలా బాధ పెడుతున్నాయి.
చాలామంది సెలబ్రిటీలు రూమర్స్ ని అసలు పట్టించుకోరు. కానీ, అవి మితిమీరిపోయినట్లయితే, కచ్చితంగా స్పందించాల్సిందే. గీతు నాయర్ అనే ఫేక్ ప్రొఫైల్ లో మమతా ఆరోగ్యం గురించి ఫేక్ వార్త సర్క్యులేట్ అయింది. అందులో ”నేను మరణానికి లొంగిపోతున్నాను. ఇక బతకలేను మమతా జీవితం దుర్భర స్థితిలో ఉంది.” అని రాశారు. ప్రస్తుతం ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.