Mahesh Babu T Shirt Price : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఇటీవలి కాలంలో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు కారం అనే చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు చాలా తక్కువగా బయట కనిపిస్తుంటారు. ఆయన రీసెంట్‌గా యానిమల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కనిపించి సందడి చేశారు. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ భారీ ఎత్తున నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ ఎంతో సింపుల్ గా లైట్ బ్లూ కలర్ టీ షర్ట్, బ్లూ జిన్స్ తో వచ్చారు. తాజాగా మహేష్ బాబు ధరించిన టీషర్ట్ ధర నెట్టింట వైరల్ అవుతుంది. ఒక ప్లెయిన్ టీషర్ట్ , జీన్స్ వేసుకొని వచ్చి అందరిని డామినేట్ చేశాడు మహేష్ బాబు. అయితే మహేష్ వేసుకున్న టీషర్ట్ సింపుల్ గానే ఉంది కానీ దాని ధర మాత్రం దిమ్మతిరిగే రేంజ్ లో ఉంది. గివేంచి బ్రాండ్ కు చెందిన ఈ టీషర్ట్ చాలా కాస్ట్ గురూ.. దీని ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ టీషర్ట్ ధర అక్షరాలా రూ. 47వేలు. చూడటానికి సింపుల్ గా ఉంది కానీ ధర మాత్రం మైండ్ బ్లాక్ చేస్తుంది అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
మహేష్ బాబు టీషర్ట్ ధర విన్న తర్వాత అందరు కూడా ..మరి సూపర్ స్టార్ మహేష్ బాబా? మజాకా అంటూ అభిమానులు అంటున్నారు. సాధారణంగా ఎక్కువ మంది సెలబ్స్ స్పెషల్ గా డిజనర్ సెట్ చేసిన డ్రెస్సులు, చీరలు ధరించి వెళ్తుంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం దీనికి పూర్తి విరుద్దం. మూవీ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్స్ కి చాలా సింపుల్ గా వెళ్తుంటారు. ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకున్నా చాలా ట్రెండీగా కనిపిస్తారని అభిమానులు అంటుంటారు. యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి కూడా అలానే వచ్చిన ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…