వినోదం

Leo Movie OTT : లియో ఓటీటీ రిలీజ్‌లో పెద్ద ట్విస్టే ఇచ్చారుగా.. రెండు డేట్స్ ప్ర‌క‌టించిన నెట్‌ఫ్లిక్స్

Leo Movie OTT : ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన లేటెస్ట్ మూవీ లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు . అక్టోబ‌ర్ 19న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఇక థియేటర్‌లో అల‌రించిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ‘లియో’ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.అయితే గ‌తంలో నవంబర్‌ 17న వస్తుందని, లేదు.. నవంబర్‌ 21న స్ట్రీమింగ్‌ అవుతుందని ప్రచారం జరిగింది.

అయితే ప్ర‌చారాల‌న్నింటికి చెక్‌ పెడుతూ లియో సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ రెండు తేదీలను ప్రకటించింది. భారత్‌లో నవంబర్‌ 24 నుంచి లియో స్ట్రీమింగ్ కానుండగా.. ప్రపంచ వ్యాప్తంగా మాత్రం నవంబర్‌ 28 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఈ విష‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ సోష‌ల్ మీడియాలో తెలుపుతూ.. అన్న‌న్ వరార్ వ‌ళీ విడు (అన్న వ‌స్తున్నాడు దారి ఇవ్వండి) అంటూ రాసుకొచ్చింది ఇండియాలో నవంబర్‌ 24న తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో లియో సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో బ్యానర్‌పై లలిత్‌ కుమార్‌, జగదీష్‌ పళని స్వామి భారీ బడ్జెట్‌తో లియో సినిమాను నిర్మించారు. మిస్కిన్‌, మడోన్నా సెబాస్టియన్‌, జార్జ్‌, మన్సూర్‌ అలీఖాన్‌, ప్రియా ఆనంద్‌, మాథ్యూ థామస్‌, బాబూ ఆంటోని, లీలా శామ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Leo Movie OTT

లియో చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. మాస్టర్ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత విజయ్‌ దళపతి- లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా లియో కూడా మంచి హిట్ కావ‌డంతో ఇప్పుడు ఈ కాంబోలో మ‌రో సినిమా రావాల‌ని కోరుకుంటున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM