Leo Movie OTT : ఇలయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు . అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక థియేటర్‌లో అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘లియో’ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.అయితే గతంలో నవంబర్ 17న వస్తుందని, లేదు.. నవంబర్ 21న స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరిగింది.
అయితే ప్రచారాలన్నింటికి చెక్ పెడుతూ లియో సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రెండు తేదీలను ప్రకటించింది. భారత్‌లో నవంబర్ 24 నుంచి లియో స్ట్రీమింగ్ కానుండగా.. ప్రపంచ వ్యాప్తంగా మాత్రం నవంబర్ 28 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో తెలుపుతూ.. అన్నన్ వరార్ వళీ విడు (అన్న వస్తున్నాడు దారి ఇవ్వండి) అంటూ రాసుకొచ్చింది ఇండియాలో నవంబర్ 24న తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో లియో సినిమా స్ట్రీమింగ్ కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్, జగదీష్ పళని స్వామి భారీ బడ్జెట్‌తో లియో సినిమాను నిర్మించారు. మిస్కిన్, మడోన్నా సెబాస్టియన్, జార్జ్, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్, బాబూ ఆంటోని, లీలా శామ్సన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
లియో చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దళపతి- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా లియో కూడా మంచి హిట్ కావడంతో ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రావాలని కోరుకుంటున్నారు.