Leo Movie OTT : ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ వరుస సినిమాలతో సందడి చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘లియో’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్, గౌతమ్ మీనన్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్.. మరింతమంది స్టార్ యాక్టర్స్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాపై ముందు నుంచి తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు ఉండగా, ఆ అంచనాలని మూవీ అందుకుందనే చెప్పాలి. లియో తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. అయితే థియేటర్‌లో ఈ సినిమాని మిస్సయిన వారి కోసం లియో ఇప్పుడు పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది.
తాజా అప్‌డేట్ ప్రకారం లియో మరికొద్దిసేపట్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే లియో ఇంగ్లీష్‌లో కూడా సందడి చేయనుంది. బిగ్ స్క్రీన్‌పై రికార్డులు క్రియేట్ చేసిన లియో మరి నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. లియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ లో మరికొన్ని సీన్స్ యాడ్ చేయనున్నారట. థియేటర్ లో మిస్ అయిన కొన్ని సీన్స్ ను ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లో యాడ్ చేయనున్నారని తెలుస్తోంది.ఈ సినిమా దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగులో కూడా దాదాపు 30 కోట్ల వరకు వసూలు చేసింది లియో సినిమా. దీంతో విజయ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఇక విజయ్ విషయానికి వస్తే ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో చిత్రం చేస్తున్నాడు. దళపతి 68లో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా… ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్‌లో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దళపతి 68 పూజా ఈవెంట్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా, అవి చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు . ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న విషయం విదితమే.