వినోదం

Lavanya Tripathi : మా బంధం చాలా గొప్ప‌ది, కొన్ని సీక్రెట్‌గానే ఉంచుతానంటూ లావ‌ణ్య త్రిపాఠి కామెంట్స్

Lavanya Tripathi : టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య ఇటీవల నవంబర్ 1న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీతో పాటు.. అల్లు ఫ్యామిలీ, త్రిపాఠి ఫ్యామిలీ హాజరై దగ్గరుండి జరిపించారు. ఇక ఇండియాకు తిరిగివచ్చిన ఈ జంట.. న‌వంబ‌ర్ 5న సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో రిసెప్ష‌న్ జ‌రుపుకున్నారు. ఇండ‌స్ట్రీకి చెంద‌న చాలా మంది ప్ర‌ముఖులు వీరి రిసెప్ష‌న్‌లో పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పెళ్లి ఫోటోలు, రిసెప్షన్ ఫోటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కొద్ది రోజులు షూటింగ్ బిజీలో పడిపోయిన వరుణ్ తేజ్.. ఇటీవల అత్తారింటి వాళ్ల కోసం రిసెప్ష‌న్ ఏర్పాటు చేశాడు.

లావణ్య త్రిపాఠి తన జీవితంలో ఎక్కువ సమయం డెహ్రాడూన్‌లో గడిపినందున, ఆమె తన స్వస్థలం లో తన కుటుంబ సభ్యులను మరియు స్నేహితుల కోసం రిసెప్ష‌న్ ప్లాన్ చేసుకుంది.తాజాగా వారి రిసెప్ష‌న్ పిక్ బ‌య‌ట‌కు రాగా, వరుణ్ తేజ్ తెల్లటి కుర్తా పైజామాలో జాకెట్ ధరించి క‌నిపించాడు. ఇక లావ‌ణ్య త్రిపాఠి నీలం రంగు దుస్తులు ధరించింది. వారి పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రిసెప్షన్ పూర్త‌య్యాక ఈ జంట హైద‌రాబాద్‌కి తిరిగి వ‌చ్చింది. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట.. హానీ మూన్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలి నగరంని సెల‌క్ట్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది.. త్వరలోనే వీరు బాలీకి వెళ్ళబోతున్నట్లు ఓ న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Lavanya Tripathi

ఇక లావ‌ణ్య త్రిపాఠి రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ, ఆస‌క్తికర కామెంట్ పెట్టింది. నా భ‌ర్త ఎంతో అద్భుతమైన మనిషి.. చాలా ద‌యా హృద‌యం ఉన్న వాడు.. ఎంతో కేరింగ్‌గా చూసుకునేవాడు.. అత‌ని గురించి చెప్పాల్సింది ఇంకా ఎంతో ఉంది కానీ.. అది మా ఇద్దరి మధ్యలోనే ఉంచుతా.. మూడు రోజులు పెళ్లి అనే దాని గురించి చాలా క‌ల‌లు క‌న్నాం. మా ఫ్యామిలీల సమక్షంలో అది జరగాలని అనుకున్నాం.. పెళ్లి కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్.. అంటూ లావణ్య త్రిపాఠి త‌న సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చింది.లావణ్య పోస్ట్‏కు లవ్ ఎమోజీని షేర్ చేశాడు వరుణ్. ప్రస్తుతం లావణ్య పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఇక లావణ్య త్రిపాఠి ధరించిన పెళ్లి చీరకి ఒక ప్రత్యేకత ఉంది. చీరపై వరుణ్ లవ్ అని రాసి ఉన్న డిజైన్ ని కూడా లావణ్య రివీల్ చేసింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM