Latest Malayalam Movies On OTT : ఇటీవలి కాలంలో మలయాళ సినిమాలకి ప్రేక్షకాదరణ మరింత పెరుగుతుంది. చిన్న హీరోలు,సీనియర్ హీరోలు సైతం వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఓటీటీ వచ్చాక తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషలకి చెందిన సినీ ప్రియులు సైతం మలయాళ సినిమాలని ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీలో ప్రస్తుతం సందడి చేస్తున్న సినిమాలతో పాటు రానున్న సినిమాలేంటనేవి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మలయాళ సినిమాలు ఎక్కువగా మనోరమ మ్యాక్స్ ,సోని లివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్లలో ప్రసారం అవుతుంటాయి.
ముందుగా చూస్తే .. కన్నూరు స్క్వాడ్అనే చిత్రం మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందింది.ఈ సినిమా వచ్చే శుక్రవారం (నవంబర్ 17) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి రాబోతోంది. ఇక కుక్కలకి ఫీలింగ్ ఉంటాయనే కాన్సెప్ట్‌తో రూపొందిన వాలట్టీ చిత్రం నవంబర్ 7 నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక కాసర్‌గోల్డ్ అనే మలయాళ చిత్రం అక్టోబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. బంగారం చోరీ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా చిత్రాన్ని రూపొందించారు. ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సెప్టెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో దుల్కర్ మాస్ పాత్రలో కనిపించాడు.

ఇక సోని లివ్‌లో పెళ్లి చేసుకునే జంట పడే ఇబ్బందులతో రూపొందిన 18 ప్లస్ చిత్రం సందడి చేస్తుంది. ఫీల్‌గుడ్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో నెయ్‌మార్ అనే మలయాళ చిత్రం ప్రసారం అవుతుండగా, ఇది మనషులు, జంతువుల మధ్య ఉండే బంధాన్ని చాటి చెప్పేదిగా రూపొందింది. ఇది కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఇక మాస్టర్‌పీస్ వెబ్ సిరీస్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ఇందులో నిత్యా మీనన్ ప్రధాన పాత్ర పోషించగా, కామెడీ వెబ్ సిరీస్‌గా రూపొందింది.