వినోదం

Kriti Sanon : వ‌చ్చే వారంలో ప్ర‌భాస్‌తో నిశ్చితార్థంపై క్లారిటీ ఇచ్చిన కృతిస‌న‌న్

Kriti Sanon : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ప్ర‌భాస్ పెళ్లి గురించి నిత్యం ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. అనుష్క అని ఒక‌సారి, ప్ర‌భాస్ కుటుంబానికి సంబంధించిన అమ్మాయితో పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని ఒక‌సారి ఇలీ ఎన్నో ప్ర‌చారాలు సాగాయి. ఇటీవ‌ల ఆదిపురుష్ హీరోయిన్ కృతిస‌న‌న్‌తో పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌చారం ఎక్కువైంది.. ఎన్నో సందర్భాల్లో దీని గురించి ప్రచారం జరగగా.. ఈ నటులు ఇద్దరూ కూడా ఆ వార్తలను కొట్టి పారేశారు. అయినా వార్తలకు ఏమాత్రం బ్రేక్ పడట్లేదు. ఈ తరుణంలో వారిద్దరూ మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు త‌న ట్వీట్‌లో ప్ర‌భాస్, కృతి వ‌చ్చే వారం ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నార‌ని చేసిన ట్వీట్ వైరల్ అయింది. వచ్చే వారం మాల్దీవ్స్ లో ప్రభాస్, కృతి ఇద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారని… వారిద్దరూ ఒకటి కాబోతుండటం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశాడు.దీంతో అంద‌రు వారిద్ద‌రు నిశ్చితార్థం చేసుకోబోతున్నారా అని ఆశ‌గా ఎదురు చూశారు . ఉమైర్ కామెంట్ ని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. దీంతో ఈ వార్తలపై కృతి సనన్ స్పందించారు. ఇవన్నీ నిరాధార కథానాలంటూ ఆమె కొట్టిపారేశారు.

Kriti Sanon

ప్రభాస్ తో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు. అలాగే మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఇవి కేవలం అర్ధ‌ర‌హిత‌మైన వార్త‌లే అంటూ కృతిస‌న‌న్ కొట్టి పారేసింది. తొలిసారి ప్ర‌భాస్, కృతి ఆదిపురుష్ చిత్రంలో న‌టించారు. ఈ సినిమా నుండి వారిద్ద‌రికి సంబంధించి తెగ ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీత, రాముడి పాత్రల్లో వీరు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని భావించ‌గా, చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ కి విమర్శలు రావడంతో జూన్ 16, 2023కి ఈ మూవీ విడుదలని వాయిదా వేశారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM