Kriti Sanon : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి నిత్యం ఎన్నో వార్తలు హల్‌చల్ చేస్తుంటాయి. అనుష్క అని ఒకసారి, ప్రభాస్ కుటుంబానికి సంబంధించిన అమ్మాయితో పెళ్లి జరగనుందని ఒకసారి ఇలీ ఎన్నో ప్రచారాలు సాగాయి. ఇటీవల ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్‌తో పెళ్లి జరగనుందని ప్రచారం ఎక్కువైంది.. ఎన్నో సందర్భాల్లో దీని గురించి ప్రచారం జరగగా.. ఈ నటులు ఇద్దరూ కూడా ఆ వార్తలను కొట్టి పారేశారు. అయినా వార్తలకు ఏమాత్రం బ్రేక్ పడట్లేదు. ఈ తరుణంలో వారిద్దరూ మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తన ట్వీట్‌లో ప్రభాస్, కృతి వచ్చే వారం ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని చేసిన ట్వీట్ వైరల్ అయింది. వచ్చే వారం మాల్దీవ్స్ లో ప్రభాస్, కృతి ఇద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారని… వారిద్దరూ ఒకటి కాబోతుండటం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశాడు.దీంతో అందరు వారిద్దరు నిశ్చితార్థం చేసుకోబోతున్నారా అని ఆశగా ఎదురు చూశారు . ఉమైర్ కామెంట్ ని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. దీంతో ఈ వార్తలపై కృతి సనన్ స్పందించారు. ఇవన్నీ నిరాధార కథానాలంటూ ఆమె కొట్టిపారేశారు.

ప్రభాస్ తో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు. అలాగే మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఇవి కేవలం అర్ధరహితమైన వార్తలే అంటూ కృతిసనన్ కొట్టి పారేసింది. తొలిసారి ప్రభాస్, కృతి ఆదిపురుష్ చిత్రంలో నటించారు. ఈ సినిమా నుండి వారిద్దరికి సంబంధించి తెగ ప్రచారాలు నడుస్తున్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీత, రాముడి పాత్రల్లో వీరు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని భావించగా, చిత్రానికి సంబంధించిన టీజర్ కి విమర్శలు రావడంతో జూన్ 16, 2023కి ఈ మూవీ విడుదలని వాయిదా వేశారు.