Kotabommali PS OTT : ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన చిత్రం కోటబొమ్మాళి పీఎస్. హీరో మేక శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ లు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ తో పాటు రాహుల్ విజయ్ కూడా కీలక పాత్రలో నటించారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన నయట్టు చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ చిత్రానికి తేజ మర్ని దర్శకత్వం వహించగా… గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయ్యింది.
అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ సొంతం చేసుకుంది. థియేటర్లలో తమ సినిమా డిజిటల్ పార్ట్నర్ ‘ఆహా’ అని చిత్ర బృందం పేర్కొంది. అయితే ‘ఆహా’ ఓటీటీలో ‘కోట బొమ్మాళి పీఎస్’ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది? అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. బహుశా… న్యూ ఇయర్ లేదా సంక్రాంతి పండగ సందర్భంగా డిజిటల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత అంటే, ఓ నెలకు ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. కొద్ది సమయాలలో సినిమా టాక్‌ని బట్టి ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో మార్పులు ఉంటాయి.

కోటబొమ్మాళి చిత్రానికి ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం అందించగా.. జగదీశ్ చీకటి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని అంతా భావించారు. కాని తేడా కొట్టింది.. హీరోహీరోయిన్లతో పాటు మురళీ శర్మ, దయానంద రెడ్డిలు యాక్టింగ్ అదరగొట్టారు. ఎక్కడా సినిమాపై బోర్ కొట్టకుండా బాగా తెరకెక్కించారు. కోటబొమ్మాళి పీఎస్ తో పాటు పంజా వైష్ణవ్ తేజ్, టాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోహీరోయిన్లుగా చేసిన ఆదికేశ సినిమా కూడా అదే రోజు విడుదలైంది.